'సైరా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

By AN TeluguFirst Published Sep 27, 2019, 2:12 PM IST
Highlights

 మెగాస్టార్ 'సైరా' లాంటి క్రేజీ భారీ బడ్జెట్ సినిమాలో నటించడంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కి మరో మూడు రోజులే ఉందంటూ కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది.'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ 'సైరా' లాంటి క్రేజీ భారీ బడ్జెట్ సినిమాలో నటించడంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రిలీజ్ కి మరో మూడు రోజులే ఉందంటూ కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'సైరా' యు/ఎ సర్టిఫికెట్ పొందింది. రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలు.

అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకుంటోన్న ఉమైర్ సంధు.భారీ చిత్రాల విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఉమైర్ సంధు.. ఎప్పటిలానే 'సైరా'కు సూపర్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. యూఏఈలో ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుందని, అద్భుతంగా ఉందని వెల్లడించారు.

సినిమా చూసిన తరువాత మాటలు రాలేదని.. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ట్వీట్ చేశాడు. సినిమాలో చిరు పెర్ఫార్మన్స్ కి నేషనల్ అవార్డు ఖాయమని, లైఫ్ టైమ్ పెర్ఫార్మన్స్ చేశారని రాసుకొచ్చాడు. 

కాగా స్వాతంత్రసమరయోధుడు  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులుకీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 

Done with Overseas Censor Screening of & Totally SPEECHLESS !! STANDING OVATION by me 👏👏👏👏 ! BLOCKBUSTER HIT ! 🙏

— Umair Sandhu (@UmairFilms)

 

National Award waiting for ! He gave Lifetime Performance in ! 🙏🙏👏👏👏

— Umair Sandhu (@UmairFilms)

ఇవి కూడా చదవండి: 

మెగాస్టార్ 'సైరా'కి ఈ టెన్షన్లు తప్పవా..?

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

click me!