పూజా హెగ్డేకి లైఫ్‌ ఇస్తానంటోన్న టిల్లుగాడు.. `టిల్లుక్యూబ్‌`లో మెరవబోతున్న బుట్టబొమ్మ?

Published : May 03, 2024, 07:16 PM IST
పూజా హెగ్డేకి లైఫ్‌ ఇస్తానంటోన్న టిల్లుగాడు.. `టిల్లుక్యూబ్‌`లో మెరవబోతున్న బుట్టబొమ్మ?

సారాంశం

`డీజే టిల్లు`, `టిల్లు స్వ్కేర్‌` పెద్ద హిట్లు అయ్యాయి. ఇప్పుడు దీనికి మూడో సీక్వెల్‌ రాబోతుంది.అయితే దీని ద్వారా బుట్టబొమ్మకి లైఫ్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట టిల్లుగాడు.   

బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్‌ ఒక్కసారిగా తలక్రిందులైంది. రెండేళ్ల క్రితం టాలీవుడ్‌లోనే నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. కానీ వరుస పరాజయాలు ఆమెని అమాంతం కింద పడేశాయి. ఉన్న అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఖాలీ అయిపోయింది పూజా హెగ్డే. షూటింగ్‌ దశలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది కూడా హిందీ మూవీనే. కానీ తెలుగులో మాత్రం మూడు నాలుగు సినిమాలు టాక్స్ లో ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. 

పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్‌ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేని అనుకుంటున్నారట. మరోవైపు నాని హీరోగా `ఓజీ` డైరెక్టర్‌ సుజీత్‌ ఓ సినిమా చేయబోతున్నారు. ఆ మధ్యనే దీన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరుపరిశీలిస్తున్నారని సమాచారం. 

వీటికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా మరో కొత్త వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. పూజాకి టిల్లుగాడు లైఫ్‌ ఇవ్వబోతున్నారనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. తెలుగులో `టిల్లు` పాత్ర ఎంతగానో క్లిక్‌ అయ్యింది. క్యారెక్టరైజేషన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రాలు పెద్ద విజయాలు సాధించాయి. `డీజేటిల్లు` పెద్ద హిట్‌ కావడంతో దానికి సీక్వెల్‌గా `టిల్లు స్వ్కేర్‌` మూవీని తీసుకొచ్చారు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలై ఏకంగా వంద కోట్ల కలెక్షన్లని దాటేసింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. 

ఈ మూవీ హిట్‌ కావడంతో ఇప్పుడు మరో సీక్వెల్‌ని తీసుకురాబోతున్నట్టు టీమ్‌ ప్రకటించింది. `టిల్లు క్యూబ్‌` పేరుతో సినిమాని తీసుకురాబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. పూజా పరాజయాల్లో ఉంది. పైగా సినిమా ఆఫర్లు లేవు. ఈ నేపథ్యంలో టిల్లుగాడు లైఫ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియదు. ఒకవేళ నిజంగానే సెట్‌ అయితే సినిమా కూడా అదే రేంజ్‌లో వర్కౌట్‌ అయితే పూజా లైఫ్‌ మరోసారి టర్న్ తీసుకున్నట్టే అని చెప్పొచ్చు. ఈ ఛాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా