
సుహాస్(Suhas) తాజాగా ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా, రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న.. ముఖ్య పాత్రల్లో సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో ఈ ప్రసన్న వదనం సినిమా తెరకెక్కింది. ప్రసన్న వదనం సినిమా ఈ రోజు మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ ప్రసన్న వదనం తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్స్ తో ముందు నుంచి సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచారు.
మార్నింగ్ షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్ ఫికైనట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. నెల తర్వాత అంటే జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉంది. ఈ లోగా థియేట్రికల్ రన్ పూర్తి అయితే ఈ మధ్యలోనే వచ్చేయచ్చు అంటున్నారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రాన్ని సంగీతం అందించగా జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి లు నిర్మించారు.
చిత్రం కథేమిటంటే...
ఆర్జేగా పనిచేసే సూర్య(సుహాస్)కి ఓ యాక్సిడెంట్ వల్ల ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే వ్యాధి వస్తుంది. దాంతో ఎవరి మొహాలను గుర్తుపట్టలేడు. వాయిస్ లు కూడా సమస్యే. అయితే తన ప్లాబ్లం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ వస్తాడు. కేవలం తనతో ఉండే ఫ్రెండ్ విగ్నేష్(వైవా హర్ష)కి మాత్రమే తెలుసు. ఇలా నడుస్తూండగా తన జీవితంలోకి అనుకోకుండా ఆద్య(పాయల్) వస్తుంది. ఆమెను రోజూ రెగ్యులర్ గా కలుస్తున్నా గుర్తుపట్టడు. కొన్ని సంఘటనల అనంతరం మంచి స్నేహితులై ప్రేమలో పడతారు. ఇలా సూర్య లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న టైంలో తెల్లవారుజామున ఓ అబ్బాయి ఓ అమ్మాయి(సాయి శ్వేత)ని లారీ కిందకి తోసి మర్డర్ చేయడం చూస్తాడు.
కానీ ఆ మర్డర్ ఎవరు చేశారో తన ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల తెలుసుకోలేడు. దాంతో తనవంతుగా ఏదో ఒకటి చేయాలని పోలీసులకు బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. అనంతరం ఓ వ్యక్తి సూర్యపై అటాక్ చేస్తాడు. దీంతో సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి ACP వైదేహి(రాశీసింగ్)కి జరిగిన విషయం, అతని సమస్య చెప్తాడు. కానీ అనుకోకుండా సూర్య అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు మర్డర్ అయిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు? పోలీసులు ఏం చేసారు? ఈ మర్డర్ వల్ల సుహాస్ కి ఎదురైనా ఇబ్బందులు ఏంటి? అసలు సుహాస్ ని ఎవరు ఈ మర్డర్ కేసులో ఇరికించారు? వంటి విషయాల సమాహారమే ఈ చిత్రం.