దాడిపై పెదవి విప్పనున్న జగన్: అందరి చూపూ ఆ సభపైనే..

By Nagaraju TFirst Published Nov 14, 2018, 6:17 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి దాడి జరగడాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి.

విజయనగరం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి దాడి జరగడాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి.  

దాడి అనంతరం వైద్యుల సూచనతో వైఎస్ జగన్ 17 రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విజయనగరం జిల్లా సాలూరులో ఎక్కడ అయితే పాదయాత్ర నిలిపివేశారో అక్కడ నుంచి తిరిగి ప్రారంభించారు. నేటికి ఘటన జరిగి 20 రోజులు అయ్యింది. కానీ జగన్ మాత్రం తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. 

అయితే దాడికి సంబంధించి విజయనగరం జిల్లా పార్వతీపురం బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రస్తావించనున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో తనపై దాడి ఎలా జరిగింది, దాడి చేసిన నిందితుడి వివరాలు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతం, హైకోర్టును ఆశ్రయించాల్సిన అంశం,ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వచ్చిన ప్రకటనలపై జగన్ వివరణ ఇవ్వనున్నారు. 

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 12 నుంచి విజయనగరం జిల్లాలో పాదయత్రను పున:ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రస్తుతం పార్వతీపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలోనే ఈనెల 17న శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది వైసీపీ. 

ఇదే వేదికపై వైఎస్ జగన్ తన 23 రోజుల మౌనానికి సమాధానం చెప్పనున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబం తీవ్రంగా కలత చెందిందని అంతాతీవ్ర మనస్థాపానికి గురయ్యారని జగన్ తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఈ వ్యాఖ్యలపై ప్రత్యేకంగా జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ప్రతీ శుక్రవారం హైకోర్టులో హాజరుకావాల్సి ఉంది. అందులో భాగంగా గత నెల అక్టోబర్ 25 గురువారం హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఓహోటల్ వెయిటర్ శ్రీనివాస్ జగన్ ను కలిశారు. 

జగన్ తో రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తారా సార్ అంటూ అడిగాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ కోడికత్తితో జగన్ పై దాడికి దిగాడు. ఈ దాడిలో జగన్ ఎడమ భుజం గాయమైంది. తొమ్మిది కుట్లు పడ్డాయి. జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇకపోతే జగన్ పై దాడిని తొలుత వైసీపీ,ఇతర పార్టీలతోపాటు అధికార పార్టీ తెలుగుదేశం కూడా ఖండించింది. అంతేకాదు సిట్ ను కూడా ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేయించింది. ఆ తర్వాత దాడిపై  అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి.

 జగన్ పై దాడి అతని కుటుంబ సభ్యులే చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తప్పించేందుకు వైఎస్ విజయమ్మ, లేదా షర్మిలలే దాడి చేయించి ఉంటారని వ్యక్తిగతంగా మాట్లాడారు. అంతేకాదు జగన్ ఫ్యామిలీలో అనేక గొడవలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపాయి. 

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీలు గట్టి కౌంటర్ ఇచ్చాయి. చంద్రబాబుపై అలిపిరి దాడి భువనేశ్వరి చేయించారు అంటే ఒప్పుకుంటారా అంటూ టీడీపీని వైసీపీ నిలదీసింది. వ్యాఖ్యలు చేసే ముందు కాస్త విజ్ఞతతో ఆలోచించాలంటూ హితవు పలికింది.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. తల్లి ఎక్కడైనా కొడుకును చంపుతుందా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పై దాడిని అంతా ఖండించాలని దాడి వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. 

అంతేకానీ తల్లి హత్య చేయించింది, చెల్లి హత్య చేయించింది అంటూ  వ్యాఖ్యలు చెయ్యడం సబబు కాదన్నారు. వైఎస్ విజయమ్మ, షర్మిలలు తనను తిట్టారని అయినా వారిని ఒక్కమాట కూడా అనలేదని చెప్పుకొచ్చారు. 

జగన్ పై కత్తితో దాడి కోడికత్తి డ్రామా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు ఘాటుగానే విమర్శించారు. కోడికత్తి డ్రామా అంటూ టైటిల్ పెట్టారు. లోకేష్ అయితే ట్విట్టర్ లో కోడికత్తి డ్రామా అంటూ హ్యాష్ టాగ్ కూడా ఇచ్చారు. 

జగన్ పై దాడికి సంబంధించి అధికార పార్టీ ఎంతటి ఘాటు వ్యాఖ్యలు చేసినా అటు వైఎస్ జగన్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ పెదవి విప్పలేదు. హెల్త్ బులెటిన్ పేరుతో వైద్యులు మాత్రమే చెప్పారు. 

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కాస్తా హైకోర్టు వరకు వెళ్లింది. అంతేకాదు థర్డ్ పార్టీ విచారణ చేయించాలంటూ వైసీపీ నేతలు జాతీయ స్థాయి నేతలతోపాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను సైతం కలిశారు. థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని కోరారు. 

అటు వైసీపీ అధినేత జగన్ సైతం హైకోర్టును ఆశ్రయించారు. తనపై దాడి కేసులో ఏవన్ ముద్దాయి చంద్రబాబు అంటూ ఆరోపించారు. అయితే విచారణ చేపట్టిన కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది కూడా. 

అక్టోబర్ 25న దాడి జరిగిననాటి నుంచి వైఎస్ జగన్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఆయన తల్లి వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాత్రం స్పందించారు. తన కుమారుడిపై దాడికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 

తన కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తన భర్త దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొట్టనబెట్టుకున్నారని మళ్లీ తన కుమారుడిని పొట్టనబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

తన భర్త చనిపోయినప్పటి నుంచి తమ కుటుంబం పుట్టెడు దు:ఖంలో ఉందని మళ్లీ తన కుమారుడిపై కుట్రలు పన్నుతున్నారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడిని దూరం చేయోద్దంటూ ప్రాథేయపడ్డారు. విమానాశ్రయంలో దాడి నుంచి తన కుమారుడిని ప్రజలే కాపాడుకున్నారని ఇకపై ప్రజలే కాపాడుకోవాలని విజయమ్మ కోరారు.   

ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ఈనెల 17న విజయనగరం జిల్లా పార్వతీపురం బహిరంగ సభలో ఏం ప్రసంగిస్తారా అంటూ సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జగన్ దాడిపై చేసిన రాద్ధాంతంపై ఎలా స్పందిస్తారోనని వేచి చూస్తున్నారు. అంతేకాదు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైనా జగన్ స్పందించనున్నారు. 

జగన్ మగతనం నిరూపించుకో అంటూ చేసిన సవాల్ పైనా జగన్ మాట్లాడనున్నారు. దీంతో ఈ సభపైనే అందరిదృష్టి ఉంది. మరి బహిరంగ సభలో జగన్ ఎలా స్పందిస్తారో, ఏం చెప్పబోతున్నారు, దాడి వెనుక కుట్రలను బహిర్గతం చేయనున్నారా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్ పై దాడి: సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

 

click me!