Published : May 02, 2025, 08:56 AM ISTUpdated : May 02, 2025, 11:57 PM IST

Telugu news live updates: Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మ‌దిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. ర‌షీద్ ఖాన్ అద‌ర‌గొట్టాడు భ‌య్యా

సారాంశం

నేడు (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారు. అమరావతి పున:నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని ముఖ్య అతిథిగా వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మోదీ గన్నవారం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో అమరావతికి వస్తారు. పలు కీలక పనుల ప్రారంభానికి ప్రధాని శంకుస్థానపన చేయనున్నారు. ఇక ఈ రోజు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మ‌దిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. ర‌షీద్ ఖాన్ అద‌ర‌గొట్టాడు భ‌య్యా

11:57 PM (IST) May 02

Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మ‌దిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. ర‌షీద్ ఖాన్ అద‌ర‌గొట్టాడు భ‌య్యా

IPL 2025 SRH vs GT: గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ కు ర‌షీద్ ఖాన్ దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడు. అద్భుత‌మైన క్యాచ్ ను ప‌ట్టి జీటీకి హెడ్ త‌ల‌నొప్పిని దూరం చేశాడు. ర‌షీద్ ఖాన్ ప‌రుగెత్తుకుంటూ బౌండ‌రీలైన్ వ‌ద్ద ప‌ట్టిన ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025 లో బెస్ట్ క్యాచ్ అని చెప్ప‌వ‌చ్చు. 
 

పూర్తి కథనం చదవండి

11:33 PM (IST) May 02

IPL 2025 SRH vs GT: గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ... ప్లేఆఫ్స్ నుంచి హైదరాబాద్ టీమ్ అవుట్

IPL 2025 SRH vs GT: ఐపీఎల్ 2025లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను గుజ‌రాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. ఈ విక్ట‌రీతో గిల్ టీమ్ గుజ‌రాత్ ప్లేఆఫ్స్ కు చేరువైంది. హైద‌రాబాబ్ టీమ్ అవుట్ అయింది. 
 

పూర్తి కథనం చదవండి

11:15 PM (IST) May 02

MumbaiIndians: ముంబై ఇండియన్స్ క్రికెటర్‌పై అత్యాచార కేసు

MumbaiIndians: ముంబై ఇండియన్స్ జట్టు మాజీ ఆటగాడు శివాలిక్ శర్మపై జోధ్‌పూర్‌లో అత్యాచార కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిసినట్టు బాధితురాలు ఆరోపించింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

10:39 PM (IST) May 02

JD Vance: ఉగ్రవాదంపై పోరుకు పాకిస్తాన్ భారత్ తో కలిసి రావాలి : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

JD Vance urges Pakistan join India to fight terrorism: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ సంయమనం పాటించాలనీ, దాడి చేసిన వారిని పట్టుకోవడంలో పాకిస్తాన్ సహకరించాలని, విస్తృత ప్రాంతీయ సంఘర్షణను నివారించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కోరారు.

పూర్తి కథనం చదవండి

09:58 PM (IST) May 02

Shubman Gill: గిల్ ఔటా? నాటౌటా?.. ఏం జ‌రిగిందంటే?

Gujarat Titans captain Shubman Gill: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్ మన్ గిల్ 76 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. కానీ వివాదాస్పద రన్ అవుట్‌తో వెనుదిరిగాడు. గిల్ సూపర్ షో మధ్య అతని రనౌట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గిల్ అవుట్ అయ్యాడా?  కాలేదా? అస‌లు ఏం జ‌రిగింది?
 

పూర్తి కథనం చదవండి

09:16 PM (IST) May 02

వయసు 49 ఏళ్ళు.. అయినా బద్రి హీరోయిన్ ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా ?

తన మొదటి చిత్రం 'కహో నా ప్యార్ హై' ద్వారా రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి అమీషా పటేల్, ఇటీవలి కాలంలో తన గ్లామర్ తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

పూర్తి కథనం చదవండి

09:13 PM (IST) May 02

Pawan Kalyan: అమరావతి రీలాంచ్ లో ప్ర‌ధాని మోడీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫోటోలు చూశారా

Pawan Kalyan with Narendra Modi at Amaravati relaunch: అమరావతి రీలాంచ్ సభ ఘనంగా జరిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ స్పీచ్ ల‌తో అద‌ర‌గొట్టారు. ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోలు మీకోసం. 
 

పూర్తి కథనం చదవండి

08:36 PM (IST) May 02

PM Modi: చంద్రబాబును చూసి నేర్చుకున్నాన‌న్న ప్ర‌ధాని మోడీ.. ఏంట‌ది?

Amaravati: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. తాను, చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌గ‌తికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే తాను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నాన‌ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. బాబును చూసి ప్ర‌ధాని మోడీ ఏం నేర్చుకున్నారు? 
 

పూర్తి కథనం చదవండి

07:57 PM (IST) May 02

హీరోయిన్ మేఘన రాజ్ రెండో పెళ్లి రూమర్స్, ఎలా క్లారిటీ ఇచ్చిందో తెలుసా

తన భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత, రెండో వివాహం గురించి వస్తున్న వదంతులపై మేఘనా రాజ్ స్పష్టతనిచ్చారు.

పూర్తి కథనం చదవండి

07:46 PM (IST) May 02

Pakistan fears war with India: 2 నెలలకి సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి.. యుద్ధ భయంలో పాకిస్తాన్ !

Pakistan fears war with India: పహల్గాంలో జరిగిన దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ లో యుద్ధ భయం మొదలైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పాకిస్తాన్ ప్రజలకు సూచించింది. 

 

పూర్తి కథనం చదవండి

07:36 PM (IST) May 02

ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు, ఫ్యాన్స్ తో కలసి పార్టీ చేసుకున్న సూపర్ స్టార్

ఒక నెల వ్యవధిలో థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు సాధించిన రెండు చిత్రాలలో మోహన్ లాల్ నటించారు.

పూర్తి కథనం చదవండి

07:09 PM (IST) May 02

స్టార్ హీరో మూవీ సెట్ లో కట్టుదిట్టమైన భద్రత..ఏం చేస్తున్నారో తెలుసా

సుదీప్ నటిస్తున్న ‘బిల్లా రంగ బాష’ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో దర్శకుడు అనూప్ భండారి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. 

పూర్తి కథనం చదవండి

06:53 PM (IST) May 02

PM Modi's surprise gift to Pawan Kalyan: పవన్ కు ప్రధాని మోడీ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

Amaravati: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సభలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వేదికపైకి వచ్చిన సమయంలో రైతులు అందించిన అనూహ్య స్వాగతం సభా వాతావరణాన్ని ఉద్విగ్నంగా మార్చింది. అలాగే, ప్ర‌ధాని మోడీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 
 

పూర్తి కథనం చదవండి

06:20 PM (IST) May 02

PM Modi: నాకు న‌మ్మ‌కం ఉంది, మూడేళ్ల‌లో అమ‌రావ‌తి సాకార‌మ‌వుతుంది: మోదీ

అమ‌రావ‌తి పునఃనిర్మాణ పనుల ప్రారంభంతోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న స్పీచ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో తెలుగులో మాట్లాడారు. అమ‌రావ‌తి కేవ‌లం ఒక న‌గ‌రం మాత్ర‌మే కాద‌ని ఒక శ‌క్తి అని అభివ‌ర్ణించారు. చంద్ర‌బాబు మీద త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపారు. 
 

పూర్తి కథనం చదవండి

05:59 PM (IST) May 02

ఏసీ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో 50 % వరకు డిస్కౌంట్ ఆఫర్స్

Flip Cart Discount Sale: ఇది వేసవి కాలమా? వర్షాకాలమా? అర్థం కాకుండా ఉంది. ఏసీతో పనేముందిలే ఈ సమ్మర్ ఎలాగోలా అయిపోతుందిలే అనుకోవడానికి వీల్లేకుండా ఉంది. ఒకరోజు విపరీతంగా ఎండ కాస్తే, మర్నాడే భారీగా వర్షం పడుతోంది. అందువల్ల ఏసీ తప్పనిసరిగా కొనుక్కోవాలి. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న 50 శాతం డిస్కౌంట్ ఆఫర్స్ ఉపయోగించుకుంటే మీరు రూ.30 వేల లోపే మంచి ఏసీ కొనుక్కోవచ్చు. ఏ కంపెనీలు ఈ ఆఫర్లు అందిస్తున్నాయో తెలుసుకుందామా? 

పూర్తి కథనం చదవండి

05:40 PM (IST) May 02

PM Modi: ఇది మ‌నం చేయాలి, మ‌న‌మే చేయాలి.. మోదీ ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్

అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి విష‌యంలో కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి గురించి వివ‌రించారు. అమరావతి ఒక నగరం కాదని ఇది ఒక శ‌క్తి అని మోదీ చెప్పుకొచ్చారు. మోదీ ఇంకా ఏమ‌న్నారంటే.. 
 

పూర్తి కథనం చదవండి

05:17 PM (IST) May 02

సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుందా? రూ.56,100 జీతం వచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది

Indian Army: సైన్యంలో చేరి దేశం కోసం పోరాడాలని ఉందా? ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగం మీకు వస్తే మీ కెరీర్ మంచి జీతంతో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా? 

 

పూర్తి కథనం చదవండి

05:07 PM (IST) May 02

Chandrababu Naidu: మూడేళ్లలో అమరావతిని కట్టేస్తాం.. మళ్లీ మోదీనే ప్రారంభిస్తారు

అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల శ్రీకార కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేలా అమ‌రావ‌త‌నిని నిర్మిస్తామ‌ని తెలిపారు. మూడేళ్ల‌లోనే అమ‌రావ‌తిని నిర్మించి, మ‌ళ్లీ మోదీని ఆహ్వానిస్తామ‌ని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు ఇంకా ఏమ‌న్నారంటే.. 
 

పూర్తి కథనం చదవండి

04:42 PM (IST) May 02

నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఎలా అప్లై చేయాలంటే..

Bank of Baroda: బ్యాంకులో జాబ్ సంపాదించడం మీ లక్ష్యమా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హతలేంటి? ఎలా అప్లై చేయాలి? ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి

04:38 PM (IST) May 02

Pawan Kalyan: అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారు: ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రైన అమ‌రావ‌తి పునఃనిర్మాణ కార్య‌క్రమంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా కృతజ్ఞ‌తలు తెలిపారు. అమ‌రావ‌తి రైతులు ధ‌ర్మ యుద్ధంలో గెలిచార‌న్నారు. ప‌వ‌న్ ఇంకా ఏం మాట్లాడ‌రంటే.. 
 

పూర్తి కథనం చదవండి

04:25 PM (IST) May 02

స్విమ్ సూట్ లో నేను అందంగా ఉండను, అయినా మిస్ వరల్డ్ విజేతగా ఎలా నిలిచానంటే.. ఐశ్వర్యారాయ్ కామెంట్స్

ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్, అందం అంటే కేవలం శారీరక సౌందర్యం కాదని, మేధస్సు, ఆత్మవిశ్వాసం, కరుణ ముఖ్యమని తెలిపారు.

పూర్తి కథనం చదవండి

04:22 PM (IST) May 02

Nara Lokesh: మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరు: నారా లోకేష్

అమ‌రావ‌తి పునఃనిర్మాణ కార్య‌క్ర‌మంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి నిర్మాణాన్ని అడ్డుకున్న వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసిన అమ‌రావ‌తిని ఎవ‌రూ ఆప‌లేరంటూ నారా లోకేష్ పున‌రుద్ఘ‌టించారు. 
 

పూర్తి కథనం చదవండి

04:05 PM (IST) May 02

పెళ్లా? మేం చేసుకోం బాబోయ్.. మాకు ఒంటరిగా బతకడమే బాగుందంటున్న యువతలు: కారణాలు ఇవే

ఈ కాలం యువతుల దగ్గర పెళ్లి మాట ఎత్తితే చాలు.. పెళ్లి చేసుకోం బాబోయ్ అంటున్నారు. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు. ఆ కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

03:32 PM (IST) May 02

పహల్గాం దాడి: మధుసూదనరావు కుటుంబానికి మంచు విష్ణు పరామర్శ

పహల్గాం ఉగ్రదాడి విషాద ఛాయలు భారతదేశాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఉగ్ర దాడిలో ఏకంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

పూర్తి కథనం చదవండి

03:26 PM (IST) May 02

Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. దిగ్గ‌జ టెక్ కంపెనీల‌తో చంద్ర‌బాబు కీల‌క ఒప్పందం

అమ‌రావ‌తి అభివృద్ధి ల‌క్ష్యంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే రాజ‌ధాని పునఃనిర్మాణ ప‌నుల‌కు నాంది ప‌డ‌గా. అమ‌రావ‌తిని క్వాంట‌మ్ కంప్యూటింగ్‌కు కేంద్రంగా మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కీల‌క ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:06 PM (IST) May 02

రూ.20,000 జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 3 కార్లు ఇవే

మీ జీతం రూ.20 వేలా? కారు కొనాలనుకుంటున్నారా? మార్కెట్లో తక్కువ బడ్జెట్ లో అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బెస్ట్ కార్ల ధరలు, ఈఎంఐ, స్టైల్, మైలేజ్, తదితర వివరాలు తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి

02:51 PM (IST) May 02

విమానాలే ల్యాండ్ అయ్యేంత చక్కని రోడ్లు... ఎక్కడో కాదు మన ఇండియాలోనే

గంగా ఎక్స్‌ప్రెస్‌వే రన్‌వేగా మారిపోయింంది. రాఫెల్, మిరాజ్, జాగ్వార్ లాంటి ఫైటర్ జెట్లు ఇక్కడ టచ్ అండ్ గో ల్యాండింగ్ ప్రాక్టీస్ చేశాయి. ఈ కొత్త భద్రతా కవచం ఏ ప్రమాదం నుండి కాపాడుతుంది?

పూర్తి కథనం చదవండి

02:13 PM (IST) May 02

PM Modi: అమ‌రావ‌తిలో మోదీ ఏం చేయ‌నున్నారు.? పూర్తి వివ‌రాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃనిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. మ‌రికాసేప‌ట్లో మోదీ గ‌న్న‌వరం చేరుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు, మోదీ ఏం చేయ‌నున్నారు.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

02:04 PM (IST) May 02

Delhi High Alert : ఇంటెలిజెన్స్ వార్నింగ్ ... దేశ రాజధానిలో హైఅలర్ట్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను అలర్ట్ చేసింది కేంద్రం. అయితే తాజాగా దేశ రాజధాని డిల్లీ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతోనే ఇలా అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 

పూర్తి కథనం చదవండి

01:39 PM (IST) May 02

Hyderabad: రూ. 300 కోట్లు, 6000 ఉద్యోగాలు.. హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ స్థాయి బిస్కెట్ త‌యారీ కంపెనీ

పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో హైద‌రాబాద్ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఐటీ, ఫార్మా రంగాల్లో భారీగా పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తున్న భాగ్య‌న‌గ‌రంలో మ‌రో ప్ర‌పంచ స్థాయి కంపెనీ ఏర్పాటైంది. ప్ర‌ముఖ ఫుడ్ త‌యారీ సంస్థ లోహియా గ్రూప్ త‌న నూత‌న బిస్కెట్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

01:26 PM (IST) May 02

ష్యూరిటీ లేని రుణాలిచ్చేందుకు ఎస్‌బిఐ సిద్ధం: ఎవరికి, ఎంత ఇస్తారంటే..

మహిళలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించాలని, వ్యాపారవేత్తలుగా మార్చాలని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంకల్పించింది. అందులో భాగంగా హామీ లేని తక్కువ వడ్డీ రుణ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.  

పూర్తి కథనం చదవండి

01:03 PM (IST) May 02

విజింజాంకు కేంద్రం ఇచ్చిందేమీ లేదు..: ప్రధాని ముందే కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

విజింజామ్ నౌకాశ్రయం ప్రారంభమైంది. కేరళ కల నెరవేరిందని, అభివృద్ధికి ద్వారాలు తెరిచాయని సీఎం విజయన్ అన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ దృఢ సంకల్పం, అదానీ గ్రూప్ సహకారంతో ప్రాజెక్ట్ పూర్తయిందని... దీనికి కేంద్రం ఇచ్చిందేమీ లేదంటూ ప్రధాని మోదీ ముందే ఆసక్తికర కామెంట్స్ చేసారు.

 

పూర్తి కథనం చదవండి

12:30 PM (IST) May 02

Vizhinjam Port Inauguration : విజింజం నౌకాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని మోడీ ప్రారంభించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కలిసి ఆయన పోర్ట్ ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.

 

 

పూర్తి కథనం చదవండి

11:53 AM (IST) May 02

ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని విజింజాం పోర్టును ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సాదర స్వాగతం పలికారు. 

 

పూర్తి కథనం చదవండి

11:49 AM (IST) May 02

శవం పక్కన ఎక్కువ కూర్చోవద్దని అందుకే అంటారు.. ఆసక్తికర కారణాలు ఇవే

మీకు తెలుసా? మన శరీరంలో పది వాయువులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కాని చనిపోతే వాటన్నింటినీ ఒక్క వాయువు బయటకు తీసుకు వెళ్లిపోతుంది. ఈ 10 వాయువుల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

11:38 AM (IST) May 02

నడిస్తే చాలు డబ్బ లొచ్చిపడుతాయి.. ఈ యాప్స్ వెంటనే ఇస్టాల్ చేసుకోండి

నడక ఆరోగ్యానికి మంచిది. మీరు మీ ఆరోగ్యానికి మెరుగుపరుచుకుంటునే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బులు తెచ్చిపెట్టే కొన్ని యాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి

10:43 AM (IST) May 02

Andhra Pradesh: 22 ఏళ్ల‌ యూట్యూబ‌ర్ అనుమానాస్ప‌ద మృతి.. వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణ‌మా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన యువ యూట్యూబర్ మధుమతి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర సంచలనంగా మారింది. చిన్న వ‌య‌సులోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మ‌ధుమ‌తి ఉన్న‌ట్లుండి మ‌ర‌ణించ‌డం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందింటే.. 
 

పూర్తి కథనం చదవండి

10:41 AM (IST) May 02

Pakistan High Alert : భారత్ ను చూసి వణికిపోతున్న పాక్...  యుద్దభయంతో హైఅలర్ట్

పాాకిస్థాన్ యుద్దభయంతో వణికిపోతోంది. ఇప్పటికే ఆ దేశ ఆర్మీ మనోధైర్యాన్ని కోల్పోయింది. దీంతో భారత్ సడన్ ఎటాక్ చేస్తే ఎలాగనే టెన్షన్ ఆ దేశంలో కనిపిస్తోంది. దీంతో త్రివిద దళాలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. 

పూర్తి కథనం చదవండి

10:14 AM (IST) May 02

ఢిల్లీలో వర్షభీభత్సం... ముగ్గురు పిల్లలతో సహా తల్లి మృతి

 దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వణికిస్తున్నాయి. శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షం నలుగురిని బలితీసుకుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి

10:07 AM (IST) May 02

చైనాతో క‌లిసి భార‌త్‌లో 7 రాష్ట్రాల‌ను ఆక్ర‌మించుకుంటాం.. బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ చైర్‌పర్సన్  ఆలం ఫజ్లూర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ పై దాడి చేస్తే తమ సైన్యం పాకిస్థాన్ కు మద్ధతు నిలుస్తుందని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

పూర్తి కథనం చదవండి

More Trending News