నడిస్తే చాలు డబ్బు లొచ్చిపడుతాయి.. ఈ యాప్స్ వెంటనే ఇస్టాల్ చేసుకోండి
నడక ఆరోగ్యానికి మంచిది. మీరు మీ ఆరోగ్యానికి మెరుగుపరుచుకుంటునే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బులు తెచ్చిపెట్టే కొన్ని యాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాలని అందరూ అనుకుంటారు. దాని కోసమే పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తూ శ్రమిస్తూ ఉంటారు. దాని కోసం ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ, మీరు మీ ఆరోగ్యం కోసం వాకింగ్, రన్నింగ్ లాంటివి చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేదా కానీ నిజం. మీరు వాకింగ్ , రన్నింగ్ చేయడం వల్ల కొన్ని యాప్స్ మీకు డబ్బులు ఇస్తాయి. మరి, ఆ యాప్స్ ఏంటో తెలుసుకుందామా...
నడక
అడిడాస్ యాప్‌లో రన్నింగ్ ఛాలెంజ్ పూర్తి చేస్తే, కూపన్లు ద్వారా అడిడాస్ ఉత్పత్తులపై తగ్గింపులు పొందవచ్చు. స్వెట్‌కాయిన్ మరో ప్రముఖ యాప్. ఇంకా కొన్ని యాప్‌ల గురించి ఈ పోస్ట్‌లో చూడవచ్చు.
నడక
ప్రోత్సాహకాలు : స్వెట్‌కాయిన్, స్టెప్‌సెట్‌గో, విన్ వాక్, కాష్ వాక్ వంటి యాప్‌లు నడక, పరుగు పోటీలను నిర్వహించి ప్రోత్సాహకాలను అందిస్తాయి.
వాకింగ్ యాప్‌లు
స్వెట్‌కాయిన్: ఈ యాప్‌లో పాయింట్లతో బ్రాండెడ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ లేదా డబ్బును పొందవచ్చు. దాతృత్వానికి కూడా వీలుంది.
స్వెట్‌సెట్‌గో: ఈ యాప్ నడకను ఆసక్తికరంగా మారుస్తుంది. స్నేహితులతో పోటీపడి తగ్గింపులు పొందవచ్చు.
నడక యాప్‌లు
స్వెట్‌బెట్: ఈ యాప్‌లో ఛాలెంజ్‌లు చేపట్టి, లక్ష్యాలు చేరుకుంటే ప్రోత్సాహకాలు పొందవచ్చు. బెట్టింగ్ కూడా ఉంది.
విన్ వాక్: ఈ యాప్ మీ అడుగులను లెక్కిస్తుంది. వారు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకుంటే గిఫ్ట్ కార్డులు, ఓచర్స్ అందుకోవచ్చు.
నడక యాప్‌లు
కాష్ వాక్: ఈ యాప్ కూడా విన్ వాక్ లాంటిదే. మీరు అడుగులు వేస్తు డబ్బులు సంపాదించవచ్చు. వీడియోలు చూసి కూడా డబ్బు సంపాదించవచ్చు. మీరు రోజూ నడుస్తుంటే ఈ అవకాశాలను ఉపయోగించుకోండి.