ష్యూరిటీ లేని రుణాలిచ్చేందుకు ఎస్‌బిఐ సిద్ధం: ఎవరికి, ఎంత ఇస్తారంటే..
మహిళలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించాలని, వ్యాపారవేత్తలుగా మార్చాలని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంకల్పించింది. అందులో భాగంగా హామీ లేని తక్కువ వడ్డీ రుణ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బిఐ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'అస్మిత' అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. మహిళా వ్యాపారవేత్తలకు హామీ లేని తక్కువ వడ్డీ రుణం సదుపాయాన్ని ఎస్‌బిఐ ప్రత్యేకంగా ప్రారంభించింది. దీని ద్వారా మహిళలకు తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళలకు వ్యాపార రుణాలు
ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఎస్బీఐ విరివిగా రుణాలు ఇస్తుంది. మహిళా వ్యాపార వేత్తలను ఎంకరేజ్ చేయడానికి 3 % వ్యాపార రుణాలు ఇస్తుంది. వ్యక్తిగత రుణాలు, గృహ యాజమాన్యం కోసం 42% రుణాలు, బంగారంపై తాకట్టు వంటి వ్యక్తిగత ఆర్థిక లబ్ధి కోసం 38% రుణాలు ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
ప్లాటినం డెబిట్ కార్డ్
మహిళలకు ప్రత్యేక రుణాలతో పాటు మహిళల కోసం ‘నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును ఎస్బీఐ ప్రారంభించింది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ టోన్సే మాట్లాడుతూ ఈ కొత్త ఆఫర్‌ను సాంకేతిక ఆవిష్కరణ, సామాజిక ఇంజనీరింగ్ కలయిక అని ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా డవలప్ కావాలన్న లక్ష్యంతోనే రూపే ఆధారిత 'నారీ శక్తి' ప్లాటినం డెబిట్ కార్డును ప్రారంభించినట్లు ప్రకటించారు.
NRE, NRO సేవింగ్స్ ఖాతా
మహిళలు తక్కువ వడ్డీ రుణాలు పొందాలంటే 'బాబ్ గ్లోబల్ ఉమెన్ NRE, NRO సేవింగ్స్ ఖాతా' ను ఓపెన్ చేయడం మంచిది. దీని ద్వారా అధిక వడ్డీని అందించే బెస్ట్ స్కీమ్స్ లో చేరొచ్చు. హోమ్ లోన్స్, వాహన రుణాలపై రాయితీలు, ప్రాసెసింగ్ ఫీజుల్లో డిస్కౌంట్లు, లాకర్ అద్దెపై 100% రాయితీ, విమానాశ్రయాల్లో ఉచిత దేశీయ, అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్‌తో పాటు వ్యక్తిగతీకరించిన డెబిట్ కార్డ్ వంటి ప్రయోజనాలు ఈ అకౌంట్ ద్వారా పొందవచ్చు.
SBI ఇతర సేవలు
SBI తన వినియోగదారులకు అనేక రకాల సేవలు అందిస్తోంది. ఆన్లైన్ SBI పోర్టల్ కార్పొరేట్ కస్టమర్ల కోసం బల్క్ పేమెంట్ ప్రాసెసింగ్, పన్ను చెల్లింపులతో సహా అనేక సేవలను అందిస్తుంది. సప్లై చైన్ ఫైనాన్స్, ఇ-కలెక్షన్, డోర్‌స్టెప్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, SBI e-Tax ద్వారా ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించడం లాంటి అనేక సదుపాయాలను అన్ని వర్గాల కస్టమర్లకు అందిస్తోంది.