Pakistan fears war with India: పహల్గాంలో జరిగిన దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ లో యుద్ధ భయం మొదలైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పాకిస్తాన్ ప్రజలకు సూచించింది.
పహల్గాంలో ఉగ్రదాడి
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మే 22న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీంతో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇండియా ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరించింది. వైమానిక దళం, నౌకాదళం కూడా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. యుద్ధ సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత
పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సిద్ధం చేసిందని సమాచారం. ఇండియా దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు యుద్ధ భయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికాధికారి అసీం మునీర్ సరిహద్దుల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భయపడుతున్న సైన్యానికి ధైర్యం చెప్పేందుకే ఆయన సరిహద్దుకు వెళ్లారని తెలుస్తోంది.
పాకిస్తాన్ కుట్ర
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఇండియా ఖచ్చితంగా నమ్ముతోంది. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్లే అనీ, ఉగ్రవాదులను ఇండియాపైకి ఉసిగొల్పింది పాకిస్తాన్ అని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌పై ఇండియా ఆర్థిక ఆంక్షలు విధించింది. సింధు నది ఒప్పందం, వీసా రద్దు వంటి ఆంక్షలు ఇందులో ఉన్నాయి. ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇండియాపై ఆంక్షలు విధించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నాలుగు, ఐదు రోజులుగా ప్రతి రాత్రి ఇండియన్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. ఇండియన్ సైన్యం కూడా దీటుగా బదులిస్తోంది.
ఆహార పదార్థాలు నిల్వ చేసుకోండి అంటూ పాక్ హెచ్చరికలు
ఇండియా పాకిస్తాన్‌పై ఎప్పుడైనా యుద్ధం ప్రకటించవచ్చు. అందుకే సరిహద్దు ప్రాంత ప్రజలు రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవాలని సూచించారు.
సరిహద్దుల్లోని 13 ప్రాంతాల్లో రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేయాలని ఆదేశాలు జారీ చేశామని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల కోసం ప్రాంతీయ ప్రభుత్వం ఒక బిలియన్ రూపాయల (3.5 మిలియన్ డాలర్లు) అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు.


