సారాంశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని విజింజాం పోర్టును ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సాదర స్వాగతం పలికారు.
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రికే ఆయన విమానం తిరువనంతపురంలో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలికారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఈ సందర్భంగా మోదీతో థరూర్ ముచ్చటించారు.
విజింజాం తన కలల ప్రాజెక్ట్ ... ఈ పోర్ట్ పనులు ప్రారంభం నుండి తాను ఉన్నానని శశిథరూర్ పేర్కొన్నారు. ఈ పోర్ట్ పనులు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా... ఎప్పుడెప్పుడు ప్రారంభోత్సవం జరుకుంటుందా అని ఎదురు చూసానన్నారు. అందుకే వాతావరణ పరిస్థితులు అనుకూలించన డిల్లీ విమానాశ్రయంలో విమాానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని... అయినా ఎలాగోలా ఇక్కడికి చేరుకున్నానని థరూర్ తెలిపారు.
“నా నియోజకవర్గంలో ప్రధాని మోడీ రాక సందర్భంగా తిరువనంతపురంలో ల్యాండ్ అయ్యాను. నేను ప్రారంభం నుండి భాగస్వామిగా ఉన్న విజింజాం పోర్ట్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించడాన్ని ఎదురు చూస్తున్నాను” అని థరూర్ ఎక్స్ లో పోస్ట్ చేసారు.
విజింజాం నౌకాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ
విజింజాం నౌకాాశ్రయం భారత్ కు ఒక మైలురాయి. కేరళకు ప్రపంచ వాణిజ్యంలోకి ప్రవేశ ద్వారం లాంటిది. పాంగోడ్ మిలిటరీ సెంటర్ నుండి హెలికాప్టర్ ద్వారా విజింజాం సీపోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ పోర్ట్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన వెంట ఉన్నారు.
ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాని మోడీ భారీ MSC నౌకను స్వాగతించారు. గవర్నర్, ముఖ్యమంత్రితో సహా 17 మంది ప్రముఖులు వేదికపై ఉన్నారు. ప్రధాని పర్యటన కారణంగా రాజధాని నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రారంభోత్సవ వేడుకకు ప్రజలను కూడా అనుమతించారు.. దీంతో వేల మంది విజింజాంలో గుమిగూడారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ప్రారంభోత్సవాన్ని చూసేందుకు వచ్చారు.
గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, వి. మురళీధరన్, వాసవన్, రాష్ట్ర మంత్రులు వి. శివన్‌కుట్టి, జి.ఆర్. అనిల్, సాజీ చెరియన్, మేయర్ ఆర్యా రాజేంద్రన్, గౌతమ్ అదానీ, కరణ్ అదానీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్, ఇతరులు వేదికపై ఉన్నారు. విజిన్‌జామ్ సీపోర్ట్ మొదటి దశ ప్రారంభించబడింది. 10:30 గంటలకు విజిన్‌జామ్‌కు చేరుకున్న ప్రధాని, ప్రాజెక్ట్ ప్రాంతాన్ని 25 నిమిషాలు పర్యటించి, 11:00 గంటల ప్రాంతంలో వేదికకు చేరుకున్నారు.