- Home
- Sports
- Cricket
- Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మదిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. రషీద్ ఖాన్ అదరగొట్టాడు భయ్యా
Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మదిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. రషీద్ ఖాన్ అదరగొట్టాడు భయ్యా
IPL 2025 SRH vs GT: గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కు రషీద్ ఖాన్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. అద్భుతమైన క్యాచ్ ను పట్టి జీటీకి హెడ్ తలనొప్పిని దూరం చేశాడు. రషీద్ ఖాన్ పరుగెత్తుకుంటూ బౌండరీలైన్ వద్ద పట్టిన ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025 లో బెస్ట్ క్యాచ్ అని చెప్పవచ్చు.
IPL 2025 SRH vs GT: ఐపీఎల్ 2025 51వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడింది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం లభించింది. ట్రావిస్ హెడ్ దూకుడుగా అడుతూ మంచి టచ్ లో కనిపంచాడు.
వరుసగా ఫోర్లు కొడుతూ దూకుడు పెంచాడు. అయితే, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 5వ ఓవర్ 3వ బంతికి ట్రావిస్ హెడ్ బిగ్ షాట్ ఆడాడు. కానీ, బంతి బౌండరీ లైన్ ను దాటలేదు. అంతలోనే ట్రావిస్ హెడ్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. రషీద్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ తో హెడ్ ను పెవిలియన్ కు పంపాడు.
రషీద్ ఖాన్ పరుగెత్తుకుంటూ వచ్చి ముందుకు దూకి అద్భుతమైన క్యాచ్ ను పట్టాడు. దీంతో ట్రావిస్ హెడ్ 21 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు బాదాడు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 224/6 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ 37 బంతుల్లో 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కేవలం 23 బంతుల్లో 48 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం లభించింది. ట్రావిస్ హెడ్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ టీమ్ 186-6 పరుగులు మాత్రమే చేసి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.