కలయిక లో పాల్గొన్న ప్రతిసారీ ఆమెకు రక్తస్రావం  అవుతోంది. అయితే.. పెద్దగా  సీరియస్ గా తీసుకోలేదు. దానికి తోడు..  పిల్లలు పుట్టకుండా ఉండేందుకు గర్భనిరోదక మాత్రలు వాడింది. చివరకు.. దాని కారణంగా ఆమె ప్రాణాలు పొగొట్టుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అలెగ్జాండ్రా హోడ్గ్సన్ (26) అనే యువతికి పెళ్లయ్యింది. ఓ పాప కూడా ఉంది. అయితే.. రెండోసారి గర్భం రాకుండా ఉండేందుకు ఆమె గైనకాలజిస్ట్ సహాయంతో.. గర్భనిరోదక ఇంజెక్షన్ వాడటం మొదలుపెట్టింది.

ఆ ఇంజెక్షన్ చేయించుకున్నప్పటి నుంచి సదరు యువతికి వివిధ రకాల సమస్యలు రావడం మొదలయ్యాయి. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ భరించలేని నొప్పి రావడం మొదలైంది. చాలా సార్లు రక్త స్రావం కూడా జరిగింది. అది కూడా పీరియడ్స్ మాదిరి..  మూడు రోజులపాటు.. రక్తస్రావం జరిగేది.

ఆ గర్భనిరోదక మాత్రలు, ఇంజెక్షన్స్ వల్లే ఇలా జరుగుతోందని కొద్ది రోజులపాటు వాటిని వాడటం మానేసింది. అయినా.. కూడా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం జరగడం లాంటివి లేదు.

దీంతో.. ఆమె మరోసారి వైద్యులను సంప్రదించింది. అయితే.. వైద్యులు ఆమెకు కొన్ని పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో సదరు యువతికి గర్భాశయ క్యాన్సర్ సోకిందన్న విషయం తెలిసింది. ఆమె గర్భాశయంలో ఒక ట్యూమర్ పెరుగుతోందని వైద్యులు గుర్తించారు.

వెంటనే చికిత్స చేయాలని వైద్యులు  చెప్పారు. అయితే.. అందుకు ఆమె వద్ద సరిపోను డబ్బులు లేవు. దీంతో.. సోషల్ మీడియా సహాయంతో.. తనకు సహాయం చేయమని ఫండ్స్ సేకరించడం మొదలుపెట్టింది. 2019 ఆగస్టు నుంచి ఆమె ఫండ్స్ సేకరించింది. ఇటీవల.. ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే.. అయినా ఫలితం దక్కలేదు.

ఆపరేషన్ చేసే సమయానికే ఆమె ఫైనల్ స్టేజ్ కి చేరుకుందని.. ఆపరేషన్ సక్సెస్ కాలేదని వైద్యులు తెలిపారు. కాగా.. ఇటీవల ఆమె కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె సోదరి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.