
T20 World Cup 2026 Final సంజూ, అభిషేక్ తాండవం హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా
అహ్మదాబాద్ గడ్డ... భారత్ అడ్డా.. నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. ఫైనల్ ఫోరులో కివీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ భారత్ 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇది కేవలం ఆట కాదు... వరల్డ్ కప్ వేట.