Asianet News TeluguAsianet News Telugu

హ్యూమన్ రైట్ ఫౌండేషన్ పేరిట మోసాలు... ఈ ముఠా బెదిరింపులు చూడండి..! 

హైదరాాబాద్ ఓ ముఠా మానవ హక్కుల ఫౌండేషన్ పేరుతో కొత్తరకం దొంగతనాలకు తెరతీసారు. 

First Published Aug 8, 2023, 5:46 PM IST | Last Updated Aug 8, 2023, 5:46 PM IST

హైదరాబాద్ : మానవ హక్కుల ఫౌండేషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారం తాజాగా బయటపడింది. భార్యాభర్తల గొడవల్లో తలదూర్చిన ఈ ముఠా కోర్టుకు వెళ్లకూడదని... తామే సెటిల్ చేస్తామంటూ బెదిరిస్తోందని హైదరాబాద్ కు చెందిన సతీష్ అనే వ్యక్తి మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసాడు. డబ్బులు వసూలు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని... రాత్రుళ్లు ఫోన్ చేయడం, పిల్లలను సైతం బెదిరిస్తున్నారని వాపోయాడు. ఇప్పటికే వీరి బెదిరింపులకు సంబంధించిన వీడియోలను అందించి రాష్ట్ర డిజిపి, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఫిర్యాదు చేసినట్లు సతీష్ తెలిపారు. దయచేసి ఈ నకిలీ ముఠా నుండి రక్షణ కల్పించాలని సతీష్ మానవ హక్కల కమీషన్ ను కోరాడు.