KCR Birthday: తిరుమలలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్... వృద్దుల కడుపు నింపిన ఎమ్మెల్సీ కవిత

తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ పుట్టినరోజున కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తిరుమలకు చేరుకున్నారు. అయితే తిరుమల కొండపైకి వెళ్లేముందు నగరంలోని ఓ వృద్ధాశ్రమాన్ని కవిత సందర్శించారు. అక్కడ వృద్ధులకు ఆత్మీయంగా పలకరిస్తూ స్వయంగా తానే భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా కొందరు ఆంధ్రా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.  దేశ రాజకీయాల్లోనూ టిఆర్ఎస్ చక్రం తిప్పుతుందని... ఇప్పటికే కేంద్రంలో చురుకైన పాత్ర పోషించనుందన్న కేసీఆర్ ప్రకటనను కవిత గుర్తుచేసారు. కేసిఆర్ కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం సంతోషదాయకమన్నారు. రాజకీయంగానే ఒకరిపై ఒకరు విమర్శలు గానీ వ్యక్తిగతంగా అందరూ బావుంటారని కవిత పేర్కొన్నారు

First Published Feb 17, 2022, 4:58 PM IST | Last Updated Feb 17, 2022, 5:04 PM IST