కరీంనగర్ లో అమానుషం... ఆడపిల్లలు పుట్టారని భార్యను వదిలించుకున్న భర్త

కరీంనగర్ : మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు మహిళలు. 

Share this Video

కరీంనగర్ : మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు మహిళలు. అయినప్పటికీ మహిళలపై వివక్ష మాత్రం కొనసాగుతోంది. ఇలా ఆడపిల్లలు పుట్టారని భార్యను హాస్పిటల్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడో ప్రభుద్దుడు. ఈ  అమానుషం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కరీంనగర్ పట్టణానికి చెందిన కావ్య-రాజ్ కుమార్ దంపతులకు మొదట ఆడపిల్ల సంతానం. రెండో సారి గర్భందాల్చిన కావ్య మగబిడ్డకు జన్మనిస్తుందని భర్త భావించాడు. కానీ ఆమె మళ్లీ ఆడపిల్లే పట్టింది. దీంతో హాస్పిటల్లోనే భార్యా బిడ్డలను వదిలి వెళ్లిపోయాడు భర్త. ఇప్పటివరకు అతడి జాడ లేకపోవడంతో తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కావ్య భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.  

Related Video