రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి ఇచ్చిపడేసిన MLC కవిత | BRS vs Congress | Asianet News Telugu
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీసీ అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. కుల గణన సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదోవ పట్టించడానికి మోదీ బీసీనా కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని... దాంతో రాహుల్ గాంధీది ఏ మతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారని విమర్శించారు. వీళ్లు వాళ్లను, వాళ్లు వీళ్లను తిడుతూ ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఇవన్నీ పక్కనబెట్టి బీసీల జనాభాను సరిగ్గా లెక్కబెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలని, బీజేపీ కేంద్రంలో దాన్ని ఆమోదించాలని కోరారు. ఇవి చేయకుండా మోదీ, రాహుల్ కులమతాల గురించి ప్రజలకు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ చాలా రాజకీయ కుట్రలు చూసిందని... కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలు ఇక్కడ నడవవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క అంశానికి, సమస్యకు ఇప్పటివరకు పరిష్కారం చూపలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటలు మాట్లాడి ప్రజలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు.