Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి: సవాళ్ల కుంపట్లు, కొత్తగా చంద్రబాబు చిక్కు

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి పూలబాటేమీ కాదు. 

First Published Jul 2, 2021, 11:00 AM IST | Last Updated Jul 2, 2021, 11:00 AM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి పూలబాటేమీ కాదు. అది ముళ్ల బాటనే. ఆయన పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కబెట్టుకోవడమే కాకుండా అంపశయ్య మీద ఉన్న పార్టీకి శస్త్రచికిత్స చేసి, గాడిలో పెట్టాల్సి ఉంది. తొలుత ఆయనకు ఎదురయ్యే సవాల్ హుజూరాబాద్ శానససభ ఉప ఎన్నిక. ఇక ఆయన కొత్త సవాల్ ను ఎదుర్కుంటున్నారు. ఆయనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మచ్చ పడింది. తాను చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నేతను కాదని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సి ఉంటుంది.