డిల్లీ నడిరోడ్డుపై దొంగతనం... వ్యక్తిపై కాల్పులు జరిపి లక్షలు దోచుకున్న దుండగులు

డిల్లీ : దేశ రాజధాని డిల్లీలో సామాన్యుల ప్రాణాలకు అసలు రక్షణే లేకుండా పోయింది.

Share this Video

డిల్లీ : దేశ రాజధాని డిల్లీలో సామాన్యుల ప్రాణాలకు అసలు రక్షణే లేకుండా పోయింది. జాతీయ రాజకీయాలతోనే కాదు మహిళలపై అఘాయిత్యాలు, దారి దోపిడీల విషయంలోనూ డిల్లీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. డిల్లీలో లా ఆండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలియజేసే దారిదోపిడీ వీడియో ఒకటి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిల్లీలోని సదర్ బజార్ నుండి షాలిమార్ బాగ్ ప్రాంతానికి యజమానికి చెందిన ఐదులక్షల నగదుతో హన్నీ కల్రా బయలుదేరాడు. అయితే అతడిని శక్తినగర్ ప్రాంతంలో ముఖానికి మాస్కులు ధరించి రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు దుండగులు రోడ్డుపైనే అడ్డుకుని డబ్బుల బ్యాగ్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అందుకు అతడు నిరాకరించడంతో గన్ తో కాలిపై కాల్చి డబ్బులు దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన జనవరి 14న జరగ్గా తాజాగా సిసి కెమెరా వీడియో బయటకు వచ్చింది. 

Related Video