కరోనా వాక్సిన్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు..?
కరోనా మహమ్మారి విజృంభించి.. మన దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది.
కరోనా మహమ్మారి విజృంభించి.. మన దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. అలా ప్రాణాలు కోల్పోయిన వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. కాగా.. ఈ మహమ్మారి విరుగుడు కోసం ఎదురుచూడని వారంటూ ఎవరూ లేరు. దీంతో.. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఎప్పుడెప్పుడా అని యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రస్థాయిలో గురైన భారత్ లో ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.