ప్రపంచపు మేటి గణిత శాస్త్రజ్ఞుడు - శ్రీనివాస రామానుజన్
గణితశాస్త్రంలో ప్రాచీన భారతదేశం గొప్పతనం ఎంతచెప్పుకున్న తక్కువే. అనేక మంది భారతీయులు..
గణితశాస్త్రంలో ప్రాచీన భారతదేశం గొప్పతనం ఎంతచెప్పుకున్న తక్కువే. అనేక మంది భారతీయులు.. అంటే ఆర్యభట్ట, భాస్కర, సంగమగ్రామ మాధవన్ ల వంటివారు గణితశాస్త్రంలో భారత కీర్తిని ఆకాశహద్దులను దాటించారు. ఈ గొప్ప భారతీయ గణిత సంప్రదాయాని కొనసాగించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావువి శ్రీనివాస రామానుజన్. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావి. భారత్ గర్వించదగ్గ గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు. గొప్ప ప్రతిభాపాటవాలతో గణిత శాస్త్రంలో సరికొత్త అనేక సిద్ధాంతాలను తీసుకువచ్చారు. పేదరికం, అనారోగ్యం కారణంగా జీవితం త్వరగానే ముగించినా.. 32 సంవత్సరాల వయస్సులో చనిపోయే ముందు ప్రపంచంలోని mathematics లో గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు.ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా కూడా, రామానుజన్ సంఖ్యల శాస్త్రం, pure mathematics లో అద్భుతాలు చేశాడు. శ్రీనివాస రామానుజన్ 1887లో మైసూర్ రాజ్యంలోని ఈరోడ్‌లో (తమిళనాడు) పేద తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి కుప్పుస్వామి శ్రీనివాస అయ్యంగార్ తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో వస్త్ర దుకాణం గుమస్తా. అతని తల్లి కోమలతమ్మాళ్ అప్పుడప్పుడు ఆలయంలో కచేరీలు ఇచ్చేవారు. రామానుజన్ కుంభకోణంలో పాఠశాలలో ఉండగానే గణిత నైపుణ్యం ప్రసిద్ధి చెందింది. 16 సంవత్సరాల నాటికి.. జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. 5000 సిద్ధాంతాలను తీసుకొచ్చారు. కానీ రామానుజన్ కాలేజీకి చేరేసరికి అంతా తలకిందులైంది. అతను గణితం తప్ప మరే ఇతర అంశంపై దృష్టి పెట్టలేకపోయాడు. గణితం తప్ప అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యాడు. రామానుజన్ డిగ్రీని పొందడం కోసం అసాధ్యంగా మారి.. చాలా కృంగిపోయాడు. ఆ సమయానికి జానకిని పెళ్లాడాడు. ఆకలి చావులు పారద్రోలేందుకు ఉద్యోగం తప్పనిసరి అయింది. చివరగా, అతను మద్రాసు పోర్ట్ ట్రస్ట్‌లో నెలవారీ జీతం 20 రూపాయలతో క్లర్క్‌గా ఉద్యోగం పొందాడు. కానీ అతను కార్యాలయానికి హాజరుకాని ప్రతి నిమిషం, రామానుజన్ గణిత సమీకరణాలు, సిద్ధాంతాలపై దృష్టి సారించి.. రాసుకునే వాడు. బెర్నౌలీ సంఖ్యలపై తన అద్భుతమైన పత్రం ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించబడినప్పుడు రామానుజన్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. అతని ప్రతిభ మద్రాసు గణిత వర్గాలలో ప్రసిద్ధి చెందింది. కొంతమంది ప్రొఫెసర్ల సహాయంతో అతను విదేశాలలో గణిత మేధావులకు తన సిద్ధాంతాలకు సంబంధించిన పత్రాలను పంపుతూనే ఉన్నాడు.చివరగా, కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో ప్రఖ్యాత ప్రొఫెసర్ అయిన GH హార్డీ తన పనితో బాగా ఆకట్టుకున్నాడు. గ్రాడ్యుయేట్ కూడా లేని యువకుడి సహజ గణిత నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. వారి మధ్య గొప్ప స్నేహం, విద్యాపరమైన సహకారం ప్రారంభమైంది. రామానుజన్ మార్చి 17, 1914న లండన్‌కు బయలుదేరాడు. లండన్‌కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి సరికొత్త సిద్ధాంతాలను సృష్టించాడు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగా, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ రికార్డు సృష్టించాడు. అనేక గణిత పరిశోధన సిద్ధాంతాలను ప్రచురించిన పిన్న వయస్కుడిగా (31 ఏండ్లు) గుర్తింపు పొందారు. అయితే, అప్పటికే ఆయన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు.. అలాగే, క్షయవ్యాధి బారినపడ్డాడు. రామానుజన్ భారతదేశానికి తిరిగివచ్చిన ఒక సంవత్సరం తర్వాత.. మరణించాడు. ఆయన గుర్తుగా డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.