Video: రైతుల గోడు కరకట్ట కమల్‌హాసన్ వినిపించడం లేదా...: లోకేశ్ సెటైర్లు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాాండ్ చేస్తూ వెలగపూడిలో 22రోజులుగా రైతులు చేపడుతున్నరిలే నిరాహార దీక్షలో టిడిపి నాయకులు, మాజీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వెలగపూడిలో 22 రోజులుగా సాగిస్తున్న రైతుల రిలే నిరాహారదీక్షలో మాజీ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. గ్రామంలో ఎక్కువ మందిని అరెస్టు చేసి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని గ్రామస్థుల లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా వుంటామని భరోసా ఇచ్చిన లోకేశ్ రాజధాని గా అమరావతి నే కొనసాగించే అంశం పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు కలసి పొరాడదామని సూచించారు. కేవలం సంఘీభావం తెలిపేందుకు తాను ఇక్కడికి రాలేదని మీతో కలిసి పోరాడేందుకే వచ్చానని అన్నారు. రైతుల గోడు కరకట్ట కమలహాసన్ కి ఎందుకు కనిపించటం లేదంటూ జగన్ ఉద్దేశించి లోకేశ్ ఎద్దేవా చేశారు.