Asianet News TeluguAsianet News Telugu

సలార్ `వీఎఫ్‌ఎక్స్' అందుకే ఫెయిల్ అయ్యాయా..? తెలిసి తెలిసి ప్రశాంత్ నీల్ ఆ తప్పు ఎలా చేసాడు....

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

First Published Sep 4, 2023, 7:49 PM IST | Last Updated Sep 4, 2023, 7:49 PM IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలోనే సినిమా విడుదల కాబోతుందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. `సాహో`, `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌` చిత్రాలు వరుసగా డిజప్పాయింట్‌ చేసిన నేపథ్యంలో `సలార్‌`తో అయినా హిట్‌ కొట్టి తమ అభిమాన హీరో రేంజ్‌ ఏంటో చూపించాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. `సలార్‌` వాయిదా పడుతుందని తెలిసింది. చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా సమాచారం ఇంకా రాలేదు కానీ, ఆల్మోస్ట్ అదే అనే విషయాన్ని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు.