YS Jagan: క్లైమాక్స్ కి బాబు మోసాలు.. మూడేళ్లలో మళ్లీ అధికారం మాదే | YSRCP | Asianet News Telugu
వైయస్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గట్టిగా నిలబడినందుకు వాళ్లను ఆయన అభినందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడారని అభినందించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.