Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాలు తీసిన పార్టీ... గోరంట్ల మేజర్ కాలువలో పడి ఇద్దరు యువకులు గల్లంతు

గుంటూరు: సరదాగా కాలువగట్టున పార్టీ చేసుకోడానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు. 

గుంటూరు: సరదాగా కాలువగట్టున పార్టీ చేసుకోడానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద చోటుచేసుకుంది. కుంకలగుంటకి చెందిన నలుగురు యువకులు పార్టీచేసుకోడానికి గోరంట్ల మేజర్ కాలువవద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు వర్ల శ్రీను(25), నందిగం ఏడుకొండలు(25) కాలువలో పడిపోయారు. దీంతో మిగతా ఇద్దరు యువకులు ఈ  విషయాన్ని గ్రామస్తులు, పోలీసులకు తెలపడంతో వెంటనే అక్కడికి చేరుకున్న వారు గాలింపు చేపట్టారు. 

Video Top Stories