లోన్ రికవరి ఏజెంట్ల వేధింపులకు యువతి బలి... బాధితులకు అండగా కేశినేని చిన్ని

విజయవాడ : లోన్ రికవరీ ఏజెంట్స్ వేధిస్తుండటంతో తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన చూడలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.

Share this Video

విజయవాడ : లోన్ రికవరీ ఏజెంట్స్ వేధిస్తుండటంతో తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన చూడలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. ఇలా ఓవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న సమయంలో కూతురు ఆత్మహత్య ఆ తల్లిదండ్రులను మరింత కృంగదీసింది. పుట్టెడు దు:ఖంలో వున్న బాధిత కుటుంబానికి టిడిపి నాయకులు కేశినాని శివనాధ్ (చిన్ని) అండగా నిలిచారు. లోన్ రికవరి ఏజెంట్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న హరిత వర్షిణి ఇంటికివెళ్లిన కేశినేని చిన్ని బాధలో మునిగిన తల్లిదండ్రులను ఓదార్చారు. టిడిపి నాయకులతో కలిసి బాధిత కుటుంబం స్వస్థలమైన చందర్లపాడు మండలం కొడవటికల్లుకు వెళ్లి పరామర్శించడమే కాదు తన వంతుగా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి మంచి మనసు చాటుకున్నారు కేశినేని చిన్ని. 

Related Video