Asianet News TeluguAsianet News Telugu

జగన్ సింహాసనం ఎక్కగానే ప్రజల్ని మరిచిపోయాడు.. కేశినేని శ్వేత

మద్యం దుకాణాలు షట్ డౌన్ చేయాలని, మహిళల డిమాండ్లు నెరవేర్చాలని టీడీపీ నేత గద్దె అనురాధ చేస్తున్న 12 గంటల నిరాహారదీక్ష కు కుమారి కేశినేని శ్వేత సంఘీభావం తెలిపారు. 

మద్యం దుకాణాలు షట్ డౌన్ చేయాలని, మహిళల డిమాండ్లు నెరవేర్చాలని టీడీపీ నేత గద్దె అనురాధ చేస్తున్న 12 గంటల నిరాహారదీక్ష కు కుమారి కేశినేని శ్వేత సంఘీభావం తెలిపారు. అధికారంలోకి రావడానికి ముందు మద్యనిషేధం చేస్తాం, రుణాలు మాపి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పేదలను, మహిళలు ఇబ్బందులు పడేలా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని కేశినేని శ్వేత మండిపడ్డారు. జె టాక్స్ కోసం ప్రభుత్వం మద్యం షాప్ లను తెరిచారని అన్నారు. ప్రజా సంక్షేమానికి పనిచేయని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని విరుచుకుపడ్డారు.