ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో సెటిల్మెంటుకే జగన్ విశాఖ వచ్చాడు.. అయ్యన్నపాత్రుడు
ఎల్జీ పాలిమర్స్ విషాదం, మద్యం అమ్మకాలు, కరెంటు ఛార్జీల మీద టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఎల్జీ పాలిమర్స్ విషాదం, మద్యం అమ్మకాలు, కరెంటు ఛార్జీల మీద టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విలేకర్ల సమావేశం నిర్వహించారు. మద్యం షాపులు తెరిచి ప్రజల్ని వెర్రోళ్లను చేస్తున్నాడని, ఏవేవో చెత్త బ్రాండ్లు అమ్ముతున్నారని విరుచుకుపడ్డారు. మనుషులు తాగేవేనా అవి? అంటూ ప్రశ్నించారు. కరోనాతో అసలే పనులు లేక కష్టాల్లో ఉన్న ప్రజలమీద కరెంట్ ఛార్జీలను పెంచి పెద్ద బండ వేశారని దుయ్యబట్టారు. ఎల్జీ పాలిమర్స్ ను అక్కడినుండి మార్చాలని చూస్తున్నారని అది మంచిదే అయినా ఫ్యాక్టరీని మార్చాక అక్కడున్న వెయ్యి ఎకరాలు విజయ్ సాయిరెడ్డి కబ్జా చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు.