మానవత్వం చాటుకున్న తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి..

తాడికొండ : వైఎస్సార్ సీపీ తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మానవత్వాన్ని చాటుకున్నారు. 

Chaitanya Kiran | Updated : Dec 03 2022, 11:50 AM
Share this Video

తాడికొండ : వైఎస్సార్ సీపీ తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మానవత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె తన వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడిరోడ్డు మీదే ప్రధమ చికిత్స చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు జాతీయ రహదారిపై కారులో వెడుతుండగా క్షతగాత్రుడిని గమనించిన ఎమ్మెల్యే శ్రీదేవి తన వాహనం దిగి గాయపడిన నాడి చూసి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. తలకు బలమైన గాయాలు కావడంతో రక్తస్రావం చికిత్స అందించారు. ఆ తరువాత 108కు ఎమ్మెల్యే శ్రీదేవి స్వయంగా కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీదేవిపై స్థానికులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

Related Video