ఆధార్ తెచ్చిన తంటా.. కిలోమీటర్ల మేర క్యూలు.. ఎక్కడంటే..
కర్నూలులో ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు కిలోమీటర్ మేర బారులు తీరారు.
కర్నూలులో ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు కిలోమీటర్ మేర బారులు తీరారు. కరోనా కారణంగా మూతపడ్డ ఆధార్ అప్ డేట్ కేంద్రాలు తాజాగా తెరుచుకోవడంతో ప్రజలు అప్ డేషన్ కోసం ఎగబడ్డారు. కొండారెడ్డి బూర్జు వద్ద ఉన్న ప్రధాన పోస్టల్ కార్యాలయం వద్ద అర్ధరాత్రి నుండి నగర వాసులు పడిగాపులు కాశారు. ఒకే సారి వేలమంది రావడంతో పోస్టల్ సిబ్బంది చేతులెత్తేసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అందరికీ నచ్చచెప్పి ఇళ్లకు పంపిచేశారు.