AP Capital Crisis : అందర్నీ ఒక్కసారే కాల్చి, పూడ్చి పెట్టండి...పోలీసులపై రైతుల ఆగ్రహం

రాజధాని రైతుల అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో మంత్రి పేర్నినానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వినపత్రం ఇచ్చారు.

Share this Video

రాజధాని రైతుల అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో మంత్రి పేర్నినానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వినపత్రం ఇచ్చారు. హైపవర్ కమిటీలో రాజధాని రైతుల సమస్యలపై చర్చించి, రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు. మరోవైపు నిన్న రైతుల మీద లాఠీ ఛార్జ్ చెయ్యలేదని, లాఠీ ఛార్జ్ చెయ్యమని ఆదేశాలు ఇవ్వలేదని ఎస్పీ విజయరావు తెలిపారు. ఇక తుళ్ళూరులో రైతులు ప్రయివేట్ ప్రదేశంలో పరదాలు వేయడంతో పోలీసులు లాగేసారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. 144 సెక్షన్, యాక్ట్ 30 అమల్లో ఉంది.. నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులతో.. అందరిని ఒక్క సారిగా కాల్చి, పూడ్చి పెట్టండి అంటూ..రైతులు ఆగ్రహించారు. తమ మొరవినమంటూ ఓరైతు పోలీసుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశాడు. 

Related Video