ఎల్జీ పాలిమర్స్ విషాదం : మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కుల పంపిణీ..
విశాఖ, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు.
విశాఖ, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ , ఎంపీ సత్యనారాయణ, కలెక్టర్ వినయ చందు, పోలీస్ కమిషనర్ అర్కే మీనా, పలువురు పొల్గొని, కోటి రూపాయల చెక్కులను అందించారు.