Asianet News TeluguAsianet News Telugu

గుడివాడలో ఫ్లెక్సీల వివాదం.. ‘మా జోలికొస్తే.. నరుకుతాం’ వైసీపీ యువదళం పేరిట వెలిసిన బ్యానర్లు..

కృష్ణాజిల్లా : మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం.. 

First Published Sep 23, 2022, 1:26 PM IST | Last Updated Sep 23, 2022, 1:26 PM IST


కృష్ణాజిల్లా : మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం.. అంటూ గుడివాడ నియోజకవర్గ సరిహద్దు రెడ్డిపాలెంలో వైసిపి నేతలు బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ బ్యానర్లు  రాత్రికి రాత్రే వెలిశాయి. నేడు రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ బ్యానర్లు కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మేము ఎవరి జోలికి వెళ్ళం మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసిన నరుకుతాం అంటూ రెడ్డిపాలెం సెంటర్లో వైసీపీ యువదళం పేరిట బ్యానర్ల ఏర్పాటయ్యాయి.