నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి... చంద్రబాబుకు పోలీస్ నోటీసులు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 

Share this Video

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన తిరుపతిలో తలపెట్టిన దీక్షకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు నిలిపివేశారు. దీంతో విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు చంద్రబాబు. ఇలా ఆయన అరగంట నుంచి విమానాశ్రయంలోనే ఉన్నారు. ఇక ఇప్పటికే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన రేణిగుంట పోలీసులు... నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. 

Related Video