Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ రోడ్డు ప్రమాదం: డివైడర్ పైనుంచి ఎగిరి లారీని ఢీకొన్న టెంపో

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

First Published Feb 14, 2021, 9:13 AM IST | Last Updated Feb 14, 2021, 9:13 AM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44 పై జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడగా మరో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి అదే వేగంతో రోడ్డుకు అటువైపుగా వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో టెంపో నుజ్జునుజ్జయి మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. ప్రస్తుతం ప్రమాదస్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ అధికారులు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.