చిన్న పిల్లాడిలా నిస్పృహతో హరీష్ రావు: బాబూమోహన్

సిద్దిపేట ఘటన మంత్రి హరీశ్ రావు దర్శకత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి బాబు మోహన్ ఆరోపించారు. 

Share this Video


సిద్దిపేట ఘటన మంత్రి హరీశ్ రావు దర్శకత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి బాబు మోహన్ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ లో నిరసన దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హరీష్ రావే పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించాడన్నారు. చిన్న పిల్లాడిలాగా నిస్పృహకు గురై హరీష్ మాట్లాడుతున్నాడన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారని ఆయన అన్నారు. సిద్ధిపేట, గజ్వేలులాగా దుబ్బాక ఎందుకు అభివృద్ధి చేయలేదని బాబు మోహన్ ప్రశ్నించారు. రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాక అభివృద్ధి ఖాయమని, ప్రధాని కల్లెర్రజేస్తే మీరు జైల్లో ఉంటారు జాగత్త అని హెచ్చరించారు. ఆడవాళ్లు, పిల్లలని చూడకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారని మండిపడ్డారు. హుందాగా ఉండాల్సిన సీపీ అత్యుత్సాహం చూపించారని, నిన్నటి ఘటనపై చర్యలు తప్పవని బాబు మోహన్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతుందని, పునాదులు దుబ్బాక ఫలితంతో కదలబోతున్నాయన్నారు.

Related Video