PawanKalyan Video : పోలీసు తుపాకులకు ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్

రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మంగళవారం నాడు పోలీసులు షాకిచ్చారు.

First Published Dec 31, 2019, 3:09 PM IST | Last Updated Dec 31, 2019, 3:20 PM IST

రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మంగళవారం నాడు పోలీసులు షాకిచ్చారు. కృష్ణాయపాలెం నుండి మందడం గ్రామానికి  పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకొన్నారు. ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారని అడ్డుకొన్నారు. దీంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. కాల్చితే కాల్చుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పోలీసులపై మండిపడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ కారు దిగి నడుచుకొంటూ మందడం వైపుకు వెళ్లారు. పవన్ కళ్యాణ్‌ను మందడం వైపు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై మందడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.