AP Assembly Budget Session: తొలిరోజే అసెంబ్లీ నుంచి YS జగన్ వాకౌట్

Share this Video

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం చేశారు. అధికార టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులతో పాటు వైసీపీ సభ్యులు ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. అయితే, గవర్నర్‌ పట్టించుకోకుండానే తన ప్రసంగం కొనసాగించారు. దీంతో జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

Related Video