అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీ నుంచి నిరసనలు తెలుపుతామని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ అన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లో జరిగిన రైతు సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.
అగ్నిపథ్ స్కీం కింద భారత నావికా దళానికి శుక్రవారం నాటికి 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 2వ తేదీనే ఇండియన్ నేవీ ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అగ్నిపథ్ స్కీం కింద ఊహించిన స్థాయిలో భారత వైమానిక దళం జారీ చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తులు వచ్చాయి. ఐఏఎఫ్ చరిత్రలో చూడనన్ని దరఖాస్తులు అగ్నిపథ్ స్కీం కింద వచ్చాయని ట్వీట్ చేసింది. మంగళవారం నాటికి సుమారు 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
పంజాబ్ అసెంబ్లీలో అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా అందరు చట్టసభ్యులు ఆమోదం తెలిపారు.
బీజేపీ కార్యకర్తలకు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకునే యువతకు కొరత లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిన లేఖపై ఆమె మండిపడ్డారు.
వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. అగ్నిపథ్ పథకంపై వారు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ ఆస్తికర పరిణామం మంగళవారం ట్విట్టర్ వేదికగా చోటు చేసుకుంది. ఎవరా నాయకులు, ఏం జరిగింది ? తెలియాలంటే ఇది చదివేయండి..
Agnipath scheme: అగ్నిపథ్ పథకంపై వివాదాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కు నాలుగు రోజుల్లో 94,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం వరకు భారత వైమానిక దళానికి అగ్నిపథ్ పథకం కింద 56,960 దరఖాస్తులు వచ్చాయి.
అగ్నిపథ్ పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సమీక్షిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆ సమయంలో బయటపడే లోపాలను సరి చేస్తుందని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు ఈ పథకంపై చర్చలు జరిపామని అన్నారు.
Agnipath protestors: అగ్నిపథ్ ఆందోళనకారులకు తెలంగాణ కాంగ్రెస్ న్యాయ సహాయం అందిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రెవంత్ రెడ్డి వెల్లడించారు. ఆందోళనకారులపై పెట్టిన కేసులను కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు కీలక పాత్ర పోషించారని రైల్వే పోలీసులు గుర్తించారు.