బీజేపీ కార్యకర్తలకు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకునే యువతకు కొరత లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిన లేఖపై ఆమె మండిపడ్డారు.
అగ్నిపథ్ స్కీమ్ కింద త్రివిధ దళాల్లో చేరి నాలుగేళ్లు అగ్నివీర్లుగా పని చేసిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు పంపించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాలు బీజేపీ కార్యకర్తలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రశ్నించారు. తన రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
Udaipur horror: రాజస్థాన్ లో టెన్షన్ టెన్షన్.. సీఎం అధ్యక్షతన హై-లెవల్ మీటింగ్ !
‘‘ నాకు (కేంద్రం నుండి) ఒక లేఖ వచ్చింది. అగ్నివీర్లుగా నాలుగేళ్ల పాటు పని చేసి వచ్చిన వారి డేటా బ్యాంక్ మేం అందిస్తాం. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి. అని ఆ లెటర్ పేర్కొంది. మేం బీజేపీ కార్యకర్తలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? మాకు ఉద్యోగాలు ఇవ్వడంలో సమస్య లేదు. కానీ మా రాష్ట్రంలో ఉద్యోగం అయితే మా రాష్ట్రంలోని యువకుడికి ఇస్తాం. మీరు వారిని నాలుగు సంవత్సరాల పాటు ఉద్యోగంలో పెట్టండి. తరువాత ఆ విషయం రాష్ట్రాలకు వదిలివేయండి. ఉద్యోగం అవసరమయ్యే యువతకు మా రాష్ట్రంలో కొరత లేదు. మేము వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తాం” అని మమతా బెనర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Agnipath : అగ్నిపథ్ పై జైరాం రమేష్, మనీష్ తివారీ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగిందంటే ?
ఈ అగ్నిపథ్ పథకం 2024 లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే ఉంటుందని బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. కాగా జూన్ 14వ తేదీన ఆవిష్కరించిన ఈ పథకం ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. నాలుగేళ్ల పాటు వీరు త్రివిధ దళాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం అగ్నివీర్ లను మరో 15 ఏళ్ల పాటు విధుల్లో ఉంచుకుంటారు. మిగితా అగ్నివీర్ లకు ప్యాకేజీ అందిస్తారు.
Udaipur Murder Case: కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కర్నాటక బీజేపీ ఆన్‌లైన్ ప్రచారం !
ఈ పథకంలో లోపాలు ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఇవి తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆర్మీ ఉద్యోగార్థులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పు పెట్టారు. రైలు పట్టాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే రైలు బోగీలకు కూడా మంట పెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. కేంద్ర బలగాల్లో అగ్నీవర్ లకు 10 శాతం కోటా కల్పిస్తామని చెప్పింది. అలాగే మొదటి రిక్రూట్ మెంట్ సమయంలో రెండేళ్లు వయో పరిమితి కల్పిస్తామని తెలిపారు. మరోవైపు, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్నివీర్‌లకు సర్వీస్ తర్వాత ఉద్యోగాలు ప్రకటించాయి. కాగా ప్రతీ సంవత్సరం అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం సమీక్షిస్తుందని, ఏవైనా లోపాలు ఉంటే వాటిని వాటిని పరిష్కరిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రెండు రోజుల కిందట స్పష్టం చేశారు.