తిరుమల: శ్రీవారికి భక్తులకు శుభవార్త... త్వరలో కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు, ప్రారంభించనున్న జగన్
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు ( lord venkateswara) కొలువైయున్న తిరుమలలో (tirumala) త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు (electric buses) పరుగులు పెట్టనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు ( lord venkateswara) కొలువైయున్న తిరుమలలో (tirumala) త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు (electric buses) పరుగులు పెట్టనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. సీఎం జగన్ (ys jagan) చేతులు మీదుగా వీటిని అతి త్వరలోనే ప్రారంభించాలని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా.. ఇవి ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా తిరుమలలో కాలుష్యం లేకుండా చేయాలని ఏపీఎస్ఆర్టీసీ సంకల్పించింది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది.
దీనిలో భాగంగా తిరుమల – తిరుపతి అర్బన్ మధ్య 100 ‘‘ ఈ- బస్సులు’’ ... తిరుపతి – తిరుమల మార్గంలో మరో 50 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కడప, చిత్తూరు, రేణిగుంట, నెల్లూరు, మదనపల్లి ప్రాంతాల నుంచి మరో 50 ‘‘ ఈ బస్సులు’’ తిరుమలకు తిరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు .. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లవుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
అయితే .. ఈ ప్రణాళికను ఎప్పటి నుంచో అమలు చేయాలని భావించినా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనుండడంతో ప్రయాణీకులతో పాటు తిరుపతివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ప్రయోగాత్మకంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను నడిపి చూసింది ఆర్టీసీ. తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి వీటిని నడిపింది. 32 మంది కూర్చొనే విధంగా ఈ బస్సులను రూపొందించారు. ఈ బస్సును నడిపేందుకు అధికారులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.