తప్పులకు సహకరించిన అధికారులను జైలుకు పంపుతాం: చంద్రబాబు వార్నింగ్

దొంగ ఓట్లపై  ఎప్పటికప్పుడు  ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలుగు దేశం పార్టీ ప్రకటించింది.  తెలుగు దేశం పార్టీ అధినేత ఇవాళ చంద్రగిరిలో పర్యటించారు.

Telugu desam Party Chief Chandrababu naidu Warns officials on Bogus Votes lns

చంద్రగిరి: దొంగ ఓట్లు చేర్పించిన అధికారులను వదిలిపెట్టమని  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. 

తెలుగు దేశం పార్టీ చంద్రగిరి  అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ  పులివర్తి నానిని సోమవారం నాడు చంద్రబాబు పరామర్శించారు. 

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగఓట్ల అంశంపై ఆందోళన చేస్తూ  పులివర్తి నాని  అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో  పులివర్తి నాని తన నివాసంలో  చికిత్స పొందుతున్నారు. 

అక్రమాలకు పాల్పడిన అధికారులను జైలుకు పంపుతామని చంద్రబాబు  వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల అక్రమాలపై తిరుపతి కలెక్టర్ పై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.  

కొన్ని చోట్ల పోలింగ్ బూతులను మార్చేశారన్నారు. ఒకే పేరు  కలిగిన వ్యక్తికి మూడు పోలింగ్ బూత్‌ల్లో ఓటు ఉందని  చంద్రబాబు చెప్పారు. పుంగనూరు, నగరి,తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్టు సృష్టించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
అక్రమాలు చేసిన అధికారులను జైలుకు పంపించే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు.సచివాలయ సిబ్బంది సహాయంతో  దొంగఓట్లు నమోదు చేస్తున్నారని  చంద్రబాబు ఆరోపించారు.  బోగస్ గుర్తింపు కార్డులను కూడ ఇస్తున్నట్టుగా  చంద్రబాబు చెప్పారు.చంద్రగిరిలో  వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారని  చంద్రబాబు ఆరోపించారు.

చట్టప్రకారంగా అధికారులు వ్యవహరించాలని చంద్రబాబు కోరారు. చట్టానికి అతీతంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అంతేకాదు  డీఓపీటీకి కూడ ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు  చెప్పారు.కోర్టుల్లో కూడ  కేసులు వేస్తామని తెలిపారు. 

తన జీవితంలో ఏనాడూ కూడ ఈ తరహా  పరిస్థితిని చూడలేదన్నారు. వాలంటీర్లు ఎన్నికల వ్యవహరంలో  జోక్యం చేసుకోవద్దని  సూచించిందన్నారు. ఒకవేళ అలా చేస్తే తాము చట్టపరంగా  వ్యవహరిస్తామన్నారు. 

also read:ఆంధ్రప్రదేశ్ స్కిల్ కేసు: బాబు పిటిషన్‌పై తీర్పును వెల్లడించనున్న సుప్రీం

కుప్పంలో తాను ప్రచారం చేయకపోయినా ఎక్కువ మెజారిటీ వచ్చేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కుప్పం, చార్మినార్, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చేదని ఆయన గుర్తు చేశారు.

also read:ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

అడ్రస్ లేని వాళ్లు, రాజకీయాల్లో  ఓనమాలు  తెలియని వాళ్లు కూడ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.  తాను కూడ  వైఎస్ఆర్‌సీపీ తరహాలో రాజకీయాలు చేస్తే  ఆ పార్టీ నేతలు ఇలా ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు పద్దతిగా రాజకీయాలు చేయాలని ఆయన కోరారు.  తప్పుడు పద్దతిలో వ్యవహరిస్తే చట్టానికి పట్టిస్తామని చంద్రబాబు  చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios