అభం శుభం తెలియని ఓ చిన్నారిపై ఓ కామాందుడి కన్ను పడింది. ఆ పాపకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పాపపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా చిన్నారికి మాయమాటలు చెప్పి లేపుకువచ్చి హైదరాబాద్ లో మకాం పెట్టాడు. దీంతో  చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు చెందిన ఓ 13 ఏళ్ల పాప 7 వ తరగతి చదువుతోంది. అయితే అదే పట్టణానికి చెందిన ఖాలిద్(21) అనే యువకుడు ఈ పాపపై కన్నేశాడు. ఈ క్రమంలో చిన్నారి మాయమాటలు చెప్పి, భయపెట్టి లోబర్చుకున్నాడు.  పెళ్లి చేసుకుంటానని మాయయాటలు చెప్పి హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి పలు మార్లు అత్యాచారం చేశాడు.

అయితే తమ కూతురు కనిపించక పోవడంతో చిన్నారి తల్లిదండ్రులు తాండూర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పాప ఆచూకీకోసం విచారణ చేపట్టిన పోలీసులు నగర పోలీసుల సాయంతో ఖాలిద్ ఆచూకి ని గుర్తించారు. అతడి చెర నుంచి పాపను కాపాడిన పోలీసులు ఖాలీద్ పై కిడ్నాప్, అత్యాచార, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించననున్నామని పోలీసులు తెలిపారు.