హైదరాబాద్:  తమకు కేటాయించిన స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులను బరిలోకి దించడంపై   ఏం చేయాలనే విషయమై టీజేఎస్ మల్లగుల్లాలు పడుతోంది.  ఈ విషయమై  టీజేఎస్  కోర్ కమిటీ  గురవారం నాడు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముందే  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  కోదండరామ్ తో  భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

ప్రజాకూటమి(మహాకూటమి)లోని  భాగస్వామ్య పార్టీలైన  కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య స్నేహపూర్వకమైన  పోటీ  అనివార్యంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తమకు కేటాయించిన స్థానాల్లో  కూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ నాయకత్వం బీ ఫారాలు ఇవ్వడంపై టీజేఎస్ కొంత అసంతృప్తితోనే ఉంది. ఈ విషయమై బుధవారం నాడు రాత్రి  కోదండరామ్ పార్టీ ముఖ్యులతో చర్చించారు.

ఈ విషయమై ఏం చేయాలనే దానిపై గురువారం నాడు కోర్‌కమిటీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావించారు.అయితే  కోర్ కమిటీ సమావేశానికి కంటే ముందే గురువారం నాడు తెల్లవారుజామునే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో భేటీ అయ్యారు.

ఈ భేటీలో  ఎందుకు టీజేఎస్‌కు కేటాయించిన స్థానాల్లో   కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపాల్సి వచ్చిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి  వివరించారు.ఈ మేరకు సర్వే రిపోర్టులను  కూడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  కోదండరామ్ కు వివరించినట్టు చెప్పారు. 

గతంలో అనుకొన్నట్టుగానే  రెండు స్థానాల్లో స్నేహపూర్వకపోటీ ఉంటుందని భావించాం.... మరో రెండు స్థానాల్లో అదనంగా స్నేహాపూర్వక పోటీ నెలకొనే అవకాశం  ఉందని   కాంగ్రెస్ వర్గాలు  టీజేఎస్‌  వర్గాలకు తేల్చి చెప్పాయి.తమకు కేటాయించిన స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ  పోటీ చేయడంపై ఏం చేయాలనే దానిపై  టీజేఎస్ కోర్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

 

సంబంధిత వార్తలు

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ