పార్లమెంట్ లో టిఆర్ఎస్ షాకింగ్ స్టెప్

పార్లమెంట్ లో టిఆర్ఎస్ షాకింగ్ స్టెప్

బిజెపి, కాంగ్రెస్సేతర ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి మింగుడుపడని అంశంగా కేంద్రంపై అవిశ్వాసం తెరమీదకు వచ్చింది. బిజెపి పాలన తీరు బాగాలేకపోతే అవిశ్వాసానికి మద్దతివ్వాలంటూ ఆంధ్రా పార్టీలు టిఆర్ఎస్ ను కార్నర్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ ఇంతకాలం డోలాయమాన స్థితిలో ఉంది. తాజాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీనిపై చర్చించారు. అవిశ్వాసం చర్చ సందర్భంగా తమ ఆందోళనపై వెనక్కు తగ్గాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. అయితే అవిశ్వాసం చర్చలో పాల్గొనాలని కూడా అనుకున్నారు. కానీ ఓటింగ్ లో అటా, ఇటా అన్నది తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. చర్చ తర్వాత ఓటింగ్ ముచ్చట మాట్లాడతామని వెల్లడించారు.

పార్లమెంటులో అవిశ్వాసం విషయంలో టిఆర్ఎస్ ఇంకా సస్పెన్ష్ కొనసాగిస్తోంది. ఇంతకాలం రిజర్వేషన్ల విషయంలో పార్లమెంటు సమావేశాలను టిఆర్ఎస్ అడ్డుకున్నది. అయితే తెలుగుదేశం పార్టీ, వైసిపి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. దీంతో టిఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ మార్చింది.

అవిశ్వాసం తీర్మానం సందర్భంగా జరిగే చర్చలో పాల్గొనాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. రిజర్వేషన్ల ఆందోళనపై వెనక్కు తగ్గాలని నిర్ణయించింది. కానీ ఇక్కడే మరో మడత పేచీ పెట్టింది టిఆర్ఎస్. అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలో పాల్గొంటామని ప్రకటించారు. కానీ ఓటింగ్ విషయంలో మాత్రం టిఆర్ఎస్ కు ఇంకా క్లారిటీ రాలేదు.

టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మీడియాతో ఢిల్లీలో ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కవిత మాట్లాడారు. తాము ఎపి ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నామన్న ఆరోపణలను ఖండించారు. ఎపి కి కేంద్ర సర్కారు ఇచ్చిన హామీల అమలు చేయాలని తామూ కోరుతున్నామని వివరించారు. ఆ అంశంలో ఆంధ్రా నేతల కంటే బాగా మేమే మాట్లాడగలం అని స్పష్టం చేశారు. తమపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు.

ఎపి నేతల మాటలు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆందోళనను సాకుగా చూపి కేంద్రం సభను వాయిదా వేస్తోందని విమర్శించారు. కొందరు దుర్మార్గులు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నట్లు అవిశ్వాసాన్ని తామేమీ అడ్డుకోవడంలేదన్నారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos