- Home
- Telangana
- Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
తెలుగు స్టూడెంట్స్, ఎంప్లాయిస్ కు సూపర్ ఛాన్స్ వచ్చింది. ఈ వీక్ లో కేవలం ఒక్కరోజు కవర్ చేస్తే చాలు వరుసగా ఐదురోజుల సెలవులు కలిసివస్తాయి. ఏరోజు, ఎందుకు సెలవో తెలుసుకుందాం.

మరో లాంగ్ వీకెండ్ రెడీ
Holidays : ఒక్కరోజు సెలవు వస్తే చాలు స్కూల్ పిల్లలే కాదు కాలేజీ యువత, ఉద్యోగులు సైతం ఎగిరి గంతేస్తారు. అలాంటి వరుసగా ఐదురోజుల సెలవులు వస్తే... వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇలా ఈ వీకెండ్ లో తెలుగు స్టూడెంట్స్, ఉద్యోగులకు వరుస సెలవులు కలిసివస్తున్నాయి... కేవలం ఒక్కరోజు కవర్ చేస్తే చాలు వరుసగా ఐద్రోజుల సెలవులు పొందవచ్చు. మరి ఏరోజు, ఎందుకు సెలవు ఉంది? ఏ రోజు లీవ్ తీసుకోవాలి? అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఆగస్ట్ 26 అధికారిక సెలవు
ఈ వారంలో ఇప్పటికే సోమవారం (ఆగస్ట్ 24) గడిచిపోయినట్లే... ఇక మంగళవారం (ఆగస్ట్ 25) ఒక్కరోజు ఫుల్ వర్కింగ్ డే. తర్వాత బుధవారం (ఆగస్ట్ 26) ముస్లింల పవిత్ర పండగ మిలాదున్ నబి ఉంది… ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో అధికారిక సెలవు ఉంది. అంటే విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఈ పండక్కి అధికారికంగా హాలిడే ఇచ్చారన్నమాట.
అయితే ఆగస్ట్ 27 (గురువారం) ఒక్కరోజు మళ్లీ వర్కింగ్ డే ఉంది. ఈ రోజు కొద్దిగా మేనేజ్ చేసుకుని లీవ్ తీసుకుంటే మళ్లీ మూడ్రోజులు సెలవులే. అంటే ఒక్క లీవ్ తో మొత్తంగా ఐదు రోజుల సెలవులు కలిసివస్తాయి. ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి ఈ సెలవుల్లో కుటుంబమంతా కలిసి మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఆగస్ట్ 28 సెలవే.. ఎందుకో తెలుసా?
అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముల్ల అనుబంధాల పండగ రాఖీ. అమ్మాయిలు తమ సోదరుడికి రాఖీ కట్టి ప్రేమను చాటుకుంటారు... అలాగే అబ్బాయి తమ తోబుట్టువుకు ప్రేమతో బహుమతులు ఇస్తుంటారు. ఇలా ప్రతి కుటుంబంలో ప్రేమానురాగాలు వెల్లివిరిసేలా చేసే పండగా రాఖీ పౌర్ణమి.
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఈ రాఖీ పండగ జరుపుకుంటారు. ఈసారి రాఖీ పండగ వీకెండ్ లో వస్తోంది... ఆగస్ట్ 28 (శుక్రవారం) రాఖీ పౌర్ణమి ఉంది. ఈ రోజు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ పూర్ణిమ కూడా ఉంది. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
అయితే ఉద్యోగులకు ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈరోజు ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవు పొందవచ్చన్నమాట. చాలామంది ఈ సెలవును తీసుకునే అవకాశాలున్నాయి.
ఆగస్ట్ 29,30 సెలవులే
సాధారణంగా ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవే. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వీకెండ్ టూ డేస్ సెలవులు ఉంటాయి. ఇలాంటి ఉద్యోగులకు ఆగస్ట్ 29 (శనివారం). ఆగస్ట్ 30 (ఆదివారం) సాధారణ సెలవులే.
అయితే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలకు కూడా వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలా ఈ ఆగస్ట్ 29, 30న కొందరు విద్యార్థులకు సెలవు వస్తోంది.
ఈ శని, ఆదివారం సెలవు ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు మిలాదున్ నబి, రాఖీ పౌర్ణమి సెలవులు కలిసివస్తాయి. మధ్యలో గురువారం ఒక్కరోజు సెలవు తీసుకుంటే వరుసగా ఐదురోజులు సెలవులే... పండగే పండగ.

