Asianet News TeluguAsianet News Telugu

శ్రీ రెడ్డికి షాక్.. పోలీస్ కేసు పెట్టిన తెలుగు హీరో

తెలుగు సినీ పరిశ్రమలో తన మాటలు, చేతలతో వివాదాల్లో చిక్కుకున్న శ్రీ రెడ్డికి మరో షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ధూషణలకు దిగే వరకు శ్రీరెడ్డికి అంతో ఇంతో మద్దతు దొరికింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పై గలీజు తిట్లతో విరుచుకుపడిందో అప్పటినుంచి శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చేవారు జారుకున్నారు. పైగా శ్రీరెడ్డిని ఇంతకాలం వదిలేసిన వారంతా స్వరం పెంచి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ రెడ్డి మరీ హద్దులు మీరి సంబంధం లేని పవన్ తల్లిని కూడా వల్గర్ లాంగ్వేజ్ లో తిట్టడంతో సినీ పరిశ్రమ మొత్తం శ్రీ రెడ్డిని తూ.తూ. అని తిట్ల వర్షం కురిపించింది. పవన్ కు మద్దతు పలికింది.

ఇక ఈ విషయంలో పవన్ ను, పవన్ తల్లిని శ్రీ రెడ్డి తీవ్రమైన భాషలో తిట్టడాన్ని జీర్ణించుకోలేక తెలుగు హీరో శివ బాలాజీ రంగంలోకి దిగారు. శ్రీరెడ్డి వైఖరిని నిరసిస్తూ ఆమె మీద హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తక్షణమే శ్రీ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను తిట్టడంతోపాటు ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించిన కోణంలో చర్యలు తీసుకోవాలన్నారు. ఒక రాజకీయ పార్టీ ప్రమేయంతోనే శ్రీ రెడ్డి ఇలా పవన్ మీద రెచ్చిపోయి తిట్లు తిడుతున్నదని ఆరోపించారు. శ్రీరెడ్డి మీద ఇల్లీగల్ పనులు చేసిన కోణంలోనూ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పవన్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూనే పవన్ నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీపైనా బురద చల్లే ప్రయత్నంలో భాగమే శ్రీ రెడ్డి వ్యవహారం ఉన్నట్లు ఆరోపించారు.

ఇక ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది పవన్ కు మద్దతు పలికారు. పవన్ పై శ్రీరెడ్డి బూతులు తిట్టడాన్ని నిరసిస్తూ హీరోయిన్ మాధవీలత రోడ్డెక్కి నిరసన తెలిపారు. మౌనదీక్ష చేసి పవన్ కు మద్దతు ప్రకటించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత హీరో రాంకీ కూడా ఆందోళన చేసి అరెస్టయ్యాడు. ఇక పవన్ సోదరుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ఎవరూ ఏమీ పీకలేరని విమర్శించారు. పవన్ సహనాన్ని చేతగానితనం అనుకుంటే ప్రమాదమని హెచ్చరించారు. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు మద్దతుగా నిలబడ్డారు. అంతేకాకుండా పటాస్ లో లోబో కూడా పవన్ కు మద్దతుగా శ్రీ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.

ఈ నేపథ్యంలో తాజాగా శివ బాలాజి కూడా పవన్ కు మద్దతుగా, శ్రీ రెడ్డి బూతు భాషకు వ్యతిరేకంగా రంగంలోకి దిగడంతో పవన్ మద్దతుదారుల సంఖ్య రోజురోజుకూ సినీ పరిశ్రమలో పెరిగిపోతున్నది. మరి ఏ రాజకీయ పార్టీ ప్రమేయం శ్రీరెడ్డి బూతు భాషలో ఉందో తేలాల్సి ఉంది.

Tollywood hero files case against actress srireddy

Follow Us:
Download App:
  • android
  • ios