హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు  తెలంగాణ రాష్ట్ర  భారీ నీటి పారుదల శాఖ మంత్రి  హరీష్ రావు  19 ప్రశ్నలతో కూడి బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఈ లేఖను  హరీష్‌రావు  విడుదల చేశారు.

గురువారం నాడు హైద్రాబాద్‌ టీఆర్ఎస్‌ శాసనసభ పక్ష కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులను  కట్టకూడదని  చంద్రబాబునాయుడు కుట్ర చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు  ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హమీని హరీష్ రావు  గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చంద్రబాబునాయుడు విషం చిమ్మారని హరీష్ రావు గుర్తు చేశారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  పాలమూరును దత్తత తీసుకొంటామని చంద్రబాబునాయుడు ప్రకటించారన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలమూరులో ప్రాజెక్టులను పూర్తి చేయాలని  చంద్రబాబునాయుడు ధర్నాలు చేసిన విషయాన్ని హరీష్ ప్రస్తావించారు.

2014 ఎన్నికల సమయంలో  పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి  చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. కానీ, ఏపీ సీఎంగా  పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు  కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు.

హైద్రాబాద్ ఉమ్మడి ఆస్తులు, హైకోర్టు విభజన విషయంలో, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో  చంద్రబాబునాయుడు  చేసిన కుట్ర‌ల విషయంలో  తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబునాయుడును చూస్తే ఊసరవెల్లి కూడ సిగ్గుపడుతోందన్నారు. తెలంగాణలో టీడీపీ పోటీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబునాయుడు తీవ్రంగా  వ్యతిరేకించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.

రాజకీయ ఉనికిని చాటుకొనే ప్రయత్నంలో భాగంగా తెలంగాణను దెబ్బతీసే కుట్ర దాగి ఉందన్నారు హరీష్ రావు అభిప్రాయపడ్డారు.  తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబుకు గిట్టదన్నారు.  తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించారని హరీష్ రావు ఆరోపించారు.తెలంగాణలో రాజకీయ అస్థిరతకు  చంద్రబాబునాయుడు  కుట్ర పన్నారని హరీష్ రావు చెప్పారు.

సంబంధిత వార్తలు

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

అప్పుడే వెనక్కి తగ్గుతా: హరీష్ పై వ్యాఖ్యల మీద రేవూరి

కట్టుబడి ఉన్నా: హరీష్‌ మీది వ్యాఖ్యలపై రేవూరి ప్రకాష్ రెడ్డి

చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం

టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?