హైదరాబాద్: తన మామను ఓడించాలని హరీష్ రావు తనను కోరాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గజ్వెల్ కాంగ్రెసు నాయకుడు వంటేరు ప్రతాప రెడ్డి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఓ ప్రైవేట్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

హరీశ్ రావు తనను చూసి భయపడుతున్నారని వంటేరు ప్రతాప రెడ్డి అన్నారు. గతంలో తానూ, హరీశ్ రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామని చెప్పారు. ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడినట్లు తాను చేసిన వ్యాఖ్యలకే కాకుండా అన్నింటికీ తగిన ఆధారాలున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని ఆయన అన్నారు ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటూ హరీశ్ సిద్ధమా అని ప్రశ్నించారు.
 
హరిశ్ రావు గజ్వేల్ జీతగాడైపోయాడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకుడైన హరీశ్ రావు గ్రామంలో ఉండి..గ్రామస్థాయి నాయకుడైన తనను ఛాలెంజ్ చేస్తున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం లేదా? తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?