పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

తనపై గజ్వేల్ కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి హరీష్ రావు ఘాటుగా  స్పందించారు. ప్రతాప్ రెడ్డి మానసిక స్థితి బాగోలేదని అందువల్లే తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని హరీష్ విమర్శించారు. 

minister harish rao respond about onteru prathap reddy comments

 

తనపై గజ్వేల్ కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి హరీష్ రావు ఘాటుగా  స్పందించారు. ప్రతాప్ రెడ్డి మానసిక స్థితి బాగోలేదని అందువల్లే తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని హరీష్ విమర్శించారు. పిచ్చి పట్టి వంటేరు ప్రతాప రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేతిలో ఓడిపోతానని తెలిసి ఒంటేరు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తాను కాంగ్రెస్ అధినాయకత్వంతో టచ్ లో వున్ననని ప్రతాప్ రెడ్డి ఆరోపించడాన్ని  హరీష్ ఖండించారు. తన పుట్టుక....చావు రెండు టీఆర్ఎస్ పార్టీలోనేనని స్పష్టం చేశారు. 

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతాప్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. గజ్వేల్ లో కనీసం డిపాజిల్ కూడా రాదన్న నిస్పృహతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ ఓటమి నుంచి తప్పించుకోడానికే టీఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభమంటూ ప్రచారం చేస్తున్నాడని హరీష్ పేర్కొన్నారు. 

 తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలని ప్రతాప్ రెడ్డికి సూచించారు.  ఓటమి భయంతోనే ఆయన జిమ్మిక్కులు చేస్తున్నారన్నాడని... ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది ప్రతాపరెడ్డి అని విమర్శించారు. అయన వార్డ్ మెంబెర్ గా కూడా గెలిచే సత్తా లేదన్నారు.  తాను గజ్వేల్ లోనే ఉండి ప్రతాపరెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని హరీష్ సవాల్ విసిరారు.

 తన మామ కేసీఆర్ ను ఓడించాలని స్వయంగా మంత్రి హరీష్ రావు తనకు ఫోన్ చేసి చెప్పారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. అలాగే తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారని, త్వరలో కాంగ్రెసు కండువా కప్పుకుంటారని వంటేరు ప్రతాప రెడ్డి ఇవాళ  మధ్యాహ్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. వంటేరు వ్యాఖ్యలపై స్పందిస్తే హరీష్ పై విధంగా  సమాధానం ఇచ్చారు.    

వీడియో

"

మరిన్ని వార్తలు

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు


    

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios