కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను
హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ కేసిఆర్ తన తనయుడు కేటి రామారావు ప్రాధాన్యాన్ని పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంలో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో మంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అల్లుడు హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావుపై కేసిఆర్ పూర్తిగా స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆయన వార్తలపై నిషేధం పెట్టడమే కాకుండా ఆయన ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించినట్లు చెబుతున్నారు.
హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ కేసిఆర్ తన తనయుడు కేటి రామారావు ప్రాధాన్యాన్ని పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంలో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా పరిస్థితులు తనను చుట్టుముట్టిన తీవ్రమైన అసంతృప్తిలో భాగంగానే హరీష్ రావు రాజకీయాల పట్ల తన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.
హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి ఆయన పోటీ చేసేది కూడా అనుమానమేనని అంటున్నారు. హరీష్ రావును పక్కన పెట్టి కేసిఆర్ సిద్ధిపేట నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ప్రచారం సాగుతోంది.
హరీష్ రావుపై కేసిఆర్ 24 గంటల నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట నుంచి హరీష్ రావు పోటీ చేసే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఆయనను కేసిఆర్ తప్పిస్తారా, ఆయనే తప్పుకుంటారా అనేది ప్రస్తుతానికి ఓ చర్చనీయాంశమే. కానీ, హరీష్ రావును ఏమీ కాకుండా చేసే ఎత్తుగడను కేసిఆర్ వేసినట్లు చెబుతున్నారు.
చాలా కాలంగా కేసిఆర్ కుటుంబంలో విభేదాలున్నాయని, హరీష్ రావును పక్కన పెడుతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఏదో విధంగా హరీష్ రావును సర్దుకుపోయే పరిస్థితిలో కేసిఆర్ పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితి పతాక స్థాయికి చేరినట్లు చెబుతున్నారు. కేటిఆర్ కు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే హరీష్ రావు ప్రాబల్యాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు
హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?
పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్